రాణి ముఖ‌ర్జీ ప్ర‌ధాన పాత్ర‌లో ‘మర్దానీ3’ అనౌన్స్‌మెంట్‌

రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘మర్దానీ’. ఈ సినిమా విడుద‌లై 10 ఏళ్లు అవుతుంది. 2014లో ఈ చిత్రం విడుద‌లైంది. 2019లో దీనికి సీక్వెల్‌ను రూపొందించారు. ఈ రెండు చిత్రాలు సూప‌ర్ హిట్ చిత్రాలుగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రాణించాయి. అలాగే ఈ సినిమాల‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయ్యింది.

నేటికి మ‌ర్దానీ2 రిలీజ్ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా మ‌ర్దానీ3కి సంబంధించిన మేకింగ్ వీడియోను య‌ష్‌రాజ్‌ఫిల్మ్స్ విడుద‌ల చేసింది. ఇందులో రాణి ముఖ‌ర్జీ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ శివానీ శివాజీ రాయ్ పాత్ర‌లో న‌టించారు. రాణి ముఖర్జీ గురించి మ‌న ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న మ‌ర్దానీ ఫ్రాంచైజీల‌ను ప్రేక్ష‌కుల‌కు ఎంతో గొప్ప‌గా ఆద‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా రాణి ముఖ‌ర్జీ మాట్లాడుతూ ‘‘2025 ఏప్రిల్ నుంచి మ‌ర్దానీ3 చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్నామ‌ని తెలియ‌జేయ‌టానికి ఎంతో సంతోషంగా ఉంది. పోలీస్ డ్రెస్ వేసుకుని ఓ అద్భుత‌మైన పాత్ర‌ను చేయ‌టం నాకెప్పుడూ ప్ర‌త్యేక‌మనే చెప్పాలి. ఈ పాత్ర‌ను చేయ‌టం ద్వారా మీ నుంచి నాకు అప‌రిమిత‌మైన ప్రేమాభిమానాలు ల‌భించాయి. మ‌ర్దానీ3 సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తుండ‌టం ఎంతో గ‌ర్వంగా ఉంది. మ‌న‌ల్ని కంటికి రెప్ప‌లా కాపాడుతూ, డ్యూటీలో ప్రాణ త్యాగానికి సైతం వెనుకాడ‌ని ధైర్య‌వంతులైన పోలీస్ ఆఫీస‌ర్స్‌కి ఈ సినిమా అంకితం. గ‌త ఫ్రాంచైజీల‌ను మించేలా మ‌ర్దానీ3లో గూజ్ బ‌మ్స్ తెప్పించే గొప్ప స‌న్నివేశాలున్నాయి ’’ అన్నారు.

మ‌ర్దానీ గ‌త ఫ్రాంచైజీలు ఎంతో పెద్ద హిట్స్‌గా నిలిచాయో అంద‌రికీ తెలిసిందే. వాటిని మించేలా స్క్రిప్ట్ ఉండాల‌ని వెయిట్ చేసి మ‌ర్దానీ3ని స్టార్ట్ చేస్తున్నాం. అది మా బాధ్య‌త‌. ఈ ఫ్రాంచైజీపై అంచ‌నాలుంటాయి. వాటిని అందుకునేలా సినిమా ఉండాలి. అలాగే డార్క్‌, ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోయే అంశాల‌తో మర్దానీ ఉంటుంది. నాకు ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. ఆడియెన్స్ కూడా రేపు సినిమాను థియేట‌ర్స్‌లో చూసి అంతే ఎగ్జ‌యిట్‌మెంట్ ఫీల్ అవుతార‌ని భావిస్తున్నాను.

మ‌ర్దానీ3 కోసం ఆదిత్య చోప్రా రెండు ప్ర‌తిభావంతులైన టీమ్స్‌ను ఒక్క‌టిగా ముందుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అవే డైరెక్ష‌న్ టీమ్‌, రైటింగ్ టీమ్‌. ఈ ఫ్రాంచైజీ వార‌సత్వాన్ని వీరు ముందుకు తీసుకెళతార‌ని ఆయ‌న భావిస్తున్నారు. రైల్వే మెన్ ఫేమ్ ఆయుష్ గుప్తా మ‌ర్దానీ3 స్క్రిప్ట్‌ను అందించారు. రైల్వే మెన్‌తో ప‌రిచ‌యం అయిన ఆయుష్.. స్క్రీన్ ప్లే, స్టోరీ రైటింగ్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. సినిమాకు ఘ‌న విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ఇండియాలో బెస్ట్ సిరీస్‌గా ఇది పేరు తెచ్చుకుంది.

య‌ష్ రాజ్ ఫిల్మ్స్‌కు సంబంధించిన అభిరాజ్ మిన‌వాలా, మ‌ర్దానీ3 చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బ్యాండ్ బాజా భార‌త్‌, గూండే, సుల్తాన్‌, జ‌బ్ త‌క్ హై జాన్, టైగ‌ర్‌3 చిత్రాల‌కు అభిరాజ్ అసిస్టెంట్‌గా వ‌ర్క్ చేశారు. ప్ర‌స్తుతం ఇదే బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న వార్‌2 చిత్రానికి ఆయ‌న అసోసియేట్ డైరెక్ట‌ర్‌గానూ వ‌ర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మ‌ర్దానీ3ని తెర‌కెక్కించ‌బోతున్నారు.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago