“కపుల్ ఫ్రెండ్లీ” సినిమాలో ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ మూవీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా “కపుల్ ఫ్రెండ్లీ”. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ఈ సినిమా హైలైట్స్ తెలిపారు హీరోయిన్ మానస వారణాసి

  • “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా కొద్ది గంటల్లో రిలీజ్ కాబోతోంది. మేము కొన్ని నెలలు కష్టపడిన మూవీ ఇది. ఫైనల్ గా రిలీజ్ కు వస్తుందంటే మేమంతా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం. దీని కోసమే మేమంతా వేచి చూశాం. దేవకీ నందన వాసుదేవ సినిమా తర్వాత నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. నచ్చిన ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చాను. యూవీ సంస్థ నుంచి కాల్ వచ్చింది. స్క్రిప్ట్ చెప్పారు. ఆడిషన్ ఇచ్చాను. ఈ సినిమా డైరెక్టర్, ఇతర టీమ్ ను కలిశాక వీళ్లు మూవీ మేకింగ్ పట్ల ఎంత ప్యాషన్ తో ఉన్నారో తెలిసింది. వీళ్లొక మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకుంటారని అర్థమైంది.
  • “కపుల్ ఫ్రెండ్లీ” లో మిత్ర అనే క్యారెక్టర్ లో నటించాను. తను సరదా అమ్మాయి, బాగా మాట్లాడుతుంది, అనుకున్నది వెంటనే చేసేస్తుంది. కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటుంది. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె డిగ్రీ చేసి జాబ్ కోసం చెన్నై వస్తుంది. మిత్రకు చెప్తా చెప్తా అనే డైలాగ్ ఊతపదం. ఈ మూవీలో చాలాసార్లు ఆమె నుంచి ఈ మాట వింటారు.
  • మనం ప్రేమ కథల్లో అమ్మాయి, అబ్బాయి కలవడం, లవ్ చేసుకోవడం ఇలాంటివి చూస్తాం. కానీ “కపుల్ ఫ్రెండ్లీ”లో ఆ రొటీన్ ప్రేమ కథ ఉండదు. శివ, మిత్ర ప్రపంచాలు వేరు. వాళ్ల లక్ష్యాలు వేరు, వేరే ఊర్ల నుంచి చెన్నై వస్తారు. ఇలాంటి ఒక అమ్మాయి అబ్బాయి కలవడమే అరుదైన విషయం. లివింగ్ టుగెదర్ అనేది నేను నా లైఫ్ లో ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈ సినిమాలో మాత్రం ఆ కాన్సెప్ట్ ను కొత్తగా చూపిస్తున్నాం. ఇప్పటి యువత చాలా స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు. వాళ్లకు ఏది సరైనదో కాదో ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు.
  • ఈ మూవీ నాకు, సంతోష్ కు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. సంతోష్ శోభన్ మంచి కోస్టార్. మేము ఈ మూవీ కోసం వర్క్ షాప్ చేశాం. సినిమా పట్ల ఆయనకు చాలా ప్యాషన్ ఉంది. మన కోస్టార్ పట్టుదలగా నటిస్తుంటే మనకూ ఆ ఎనర్జీ వస్తుంది. సెట్ లో కూడా చాలా సరదాగా ఉంటారు. మూవీలో ఫన్ మూవ్ మెంట్స్ ఉంటాయి. మిత్ర క్యారెక్టర్ మిమ్మల్ని నవ్విస్తుంది.
  • కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ కు సెన్సార్ వారు ఎందుకు అభ్యంతరం నాకు అర్థం కాలేదు. కపుల్ ఫ్రెండ్లీ అనే మాటకు ఎన్నో అర్థాలు తీసుకోవచ్చు. పాజిటివ్ గా తీసుకుంటే శివ, మిత్ర కపుల్స్, వాళ్లు ఫ్రెండ్లీగా ఉంటారు అనుకోవచ్చు. ఈ సినిమాలో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా నచ్చే అంశాలుంటాయి. అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది.
  • అందాల పోటీల్లో గెలిచిన అందరూ సినిమా ఇండస్ట్రీకే రారు. వేర్వేరు ప్రొఫెషన్స్ ను ఎంచుకున్న వాళ్లున్నారు. అయితే అందాల పోటీలకు సన్నద్ధమయ్యే టైమ్ లో ఎక్కువగా కెమెరాల ముందు అలవాటు అవుతాం. దాంతో సినిమా కెరీర్ కు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటాం. మిస్ ఇండియా విన్నర్ కు డబ్బులు ఇవ్వరు. ఏడాది పాటు జిమ్, హెయిర్ స్టైలింగ్, డ్యాన్స్ క్లాసెస్..వంటి సౌకర్యాలు పొందవచ్చు. నేను మిస్ ఇండియా పోటీలకు రెడీ అవుతున్న టైమ్ లోనే సినిమా అవకాశాలు వచ్చాయి. అప్పుడు నాకు అర్థం కాలేదు. నేను అందాల పోటీలకు రెడీ అవుతుంటే సినిమాలు వస్తున్నాయి అనుకున్నాను. మిస్ వరల్డ్ పోటీల నుంచి తిరిగి వచ్చాక ఇండస్ట్రీ పట్ల ఆకర్షణ పెరిగింది. ఆడిషన్స్ చేయడం, స్క్రిప్ట్స్ వినడం వంటివి చేశాను. నేను సినిమాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్లు భయపడ్డారు. తమ ఇంటి నుంచి అమ్మాయి సినిమాల్లోకి వెళ్తుందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ భయపడతాయి. ఎవర్ని నమ్మాలి, మనకు తెలియని ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేస్తారు..ఇలాంటి భయాలు వారికి ఉండేవి. మా వాళ్లూ ఇలాగే భయపడ్డారు.
  • ఈ మూవీలో సన్నిహితంగా ఉండే సన్నివేశాలు ఉంటాయి. కథ చెప్పినప్పుడే ఇది లవ్ స్టోరీ రెండు ముద్దు సీన్స్ ఉంటాయని చెప్పారు. మొదట్లో నేను సందేహించాను. కానీ మా డీవోపీ, డైరెక్టర్, హీరో సంతోష్..ఇలా టీమ్ అంతా ప్రొఫెషనల్, హానెస్ట్ గా ఉన్నారు. వీళ్లు అసభ్యంగా సీన్స్ చేయరు అని నమ్మకం కలిగింది. నాకొక కంఫర్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. సంతోష్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఈ టీమ్ అంతా ఒక మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తుంటే నటిగా నేనూ ప్రొఫెషనల్ గా ఉండాలి కదా అని నటించాను. రొమాంటిక్ సీన్స్ అయినా బ్యూటిఫుల్ గా పొయెటిక్ గా తెరకెక్కించారు. నా దృష్టిలో గ్లామర్ అంటే ఎక్స్ పోజింగ్ కాదు. టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక మా ఇంట్లో వాళ్లు కొంచెం ఇబ్బందిగా మాట్లాడారు. మన వారణాసి కుటుంబంలో ఉండి ఇలా ఎలా చేశావు అన్నారు. ఆ తర్వాత మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. సపోర్ట్ చేశారు.
  • చెన్నై నగరంలో గెరిల్లా పద్ధతిలో షూట్ చేయడం కొత్త ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. అందరూ నడుస్తూ వెళ్తుంటారు. మేము మా సీన్స్ చేయాలి. కెమెరా ఎక్కడుందో తెలియదు. ఇలా సీన్స్ చేయడం కూడా యాక్టర్స్ గా కొత్తగా అనిపించింది. మా డైరెక్టర్ ది తమిళనాడు అయినా ఆయనకు తెలుగు తెలుసు. తెలుగు, తమిళం నేటివిటీకి నచ్చేలా డైలాగ్స్ రాశారు. నేను తమిళంలోనూ డబ్బింగ్ చెబుదామని ట్రై చేశాను. కానీ మా డైరెక్టర్ నా తమిళ యాస నచ్చలేదు. నా నెక్ట్స్ మూవీ కోలీవుడ్ లోనే చేస్తున్నా. తెలుగులో స్టోరీస్ వింటున్నా. కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నా. యువతకు సందేశాన్నిచ్చేలా ఉండే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీస్ చేయాలని ఉంది. అలాగే థ్రిల్లరి మిస్టరీస్, డిటెక్టివ్ మిస్టరీస్, రొమాంటిక్ కామెడీస్, ఫీల్ గుడ్ మూవీస్ చేయాలని అనుకుంటున్నా.
TFJA

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago