ఇప్ప‌టి వ‌ర‌కు మాకు ల‌భించిన అవార్డులు, ప్ర‌శంస‌ల‌కంటే క్రిటిక్స్ అభినందించ‌డం పెద్ద అవార్డుగా భావిస్తున్నాం: నిర్మాత వేణు ఊడుగుల‌

తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్, ఖ‌మ్మం స‌రిహ‌ద్దు గ్రామాల్లో జ‌రిగిన నిజ జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. అఖిల్ రాజ్‌, తేజ‌స్వీ రావు జంట‌గా న‌టించారు. సాయిలు కంపాటి ద‌ర్శ‌కుడు. డా. నాగేశ్వ‌ర‌రావు పూజారి స‌మ‌ర్ప‌ణ‌లో ఈటీవీ విన్ ఒరిజిన‌ల్స్‌, డోలాముఖి స‌బాల్ట‌న్ ఫిల్మ్స్‌, మాన్సూన్ టేల్స్ బ్యాన‌ర్‌ల‌పై ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌, రాహుల్ మోపిదేవి నిర్మించారు. 2025లో విడుద‌లైన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ పుర‌స్కారాల్ని సొంతం చేసుకుంది. 2026 తెలంగాణ గ‌ద్ద‌ర్ అవార్డుల్లో ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, స్పెష‌ల్ జ్యూరీ, బెస్ట్ సింగ‌ర్ విభాగాల్లో నాలుగు అవార్డులు ద‌క్కాయి. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ చిత్ర బృందంతో గురువారం సోమాజీగూడ ప్రెస్ క్ల‌బ్‌లో మీట్ ది ప్రెస్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది.

ప్ర‌ముఖ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ గౌర‌వ అధ్య‌క్షులు జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు మాట్లాడుతూ సినిమా తీసిన‌న వాళ్లు మ‌గాళ్లు కాదు..సినిమాని రిలీజ్ చేసిన వాళ్లు మ‌గాళ్లు అన్న‌ది ఇప్పుడు ఇండ‌స్ట్రీలో నెల‌కొంది. ఒక‌ప్పుడు సినిమా నిర్మాణం అనేది చాలా ఆరోగ్య‌క‌రంగా ఉండేది. సినిమా డిస్ట్రిబ్యూష‌న్, ఎగ్జిబిష‌న్ వ్య‌వ‌స్థ అనేది ప‌క్కాగా ఉండేది. కానీ ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అనేది చాలా క‌ష్టంగా మారింది. ముఖ్యంగా చిన్న సినిమాలు రిలీజ్‌కు నోచుకోవ‌డం కానీ థియేట‌ర్ల‌ని ద‌క్కించుకోవ‌డం కానీ వారం రోజుల పాటు విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డ‌టం కానీ చాలా గ‌గ‌న‌మైన ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాని తీసి అనూహ్య విజ‌యాన్ని సాధించ‌డం అనేటువంటిది చాలా అభినందించాల్సిన విష‌యం. క‌థాంశం ప‌రంగా, న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్‌ ప‌రంగా చూసుకున్న‌ట్ట‌యితే ఈ సినిమాలో ప్ర‌తీ ఒక్క‌రూ చాలా గొప్ప‌గా న‌టించారు. పాత్ర‌ల్లో ఒదిగిపోయి అత్యంత స‌హ‌జ‌త్వంతో న‌టించారు. తండ్రి ఆవేద‌న‌ని, ప్రేమికుల భ‌వోద్వేగాలిని చాలా స‌హ‌జ‌సిద్ధంగా తెర‌పై ఆవిష్క‌రించారు. అందుకే ఈ సినిమాకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మంగా భావించే గ‌ద్ద‌ర్ అవార్డుల్ని అందించ‌డం జ‌రిగింది. ఈ చిత్ర బృందం చేసిన తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రోత్స‌హిస్తూ ప్ర‌భుత్వం అవార్డుల్ని, రివార్డుల్ని అందించిన నేప‌థ్యంలో ఈ చిత్ర బృందాన్ని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నాను అన్నారు.

ద‌ర్శ‌కుడు, నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ నాకు మొద‌టి నుంచి కూడా ర‌చ‌యిత‌ల‌తో, క‌వుల‌తో, జ‌ర్న‌లిస్టుల‌తో చాలా ద‌గ్గ‌రి సంబంధం ఉంది. దానికి కార‌ణం ఏంటంటే జ‌ర్న‌లిజం అంటే నాకు చాలా ఇష్టం. నేను ప‌దిహేడేళ్ల క్రితం ప‌క్ష‌ప‌త్రిక‌లో కాల‌మిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. నేను డైరెక్ట‌ర్‌ని అయి ఉండ‌క‌పోతే జ‌ర్న‌లిస్ట్‌గా ఉండేవాడిని. ఎందుకంటే క్రిటిక్ అనిపించుకోవ‌డం అంటే నాకు చాలా ఇష్టం. కాల‌మిస్టుగా ప‌ని చేసిన‌ప్పుడు చాలా పుస్త‌కాల‌పై రివ్యూలు రాశాను. క్రిటిక్స్ సినిమాల‌ని ఇలా అభినందిస్తార‌ని నాకు తెలియ‌దు. ప్ర‌భు అన్న ఫోన్ చేసి ఇలా అభినంద‌న స‌భ ఏర్పాటు చేస్తున్నామంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇప్ప‌టి వ‌ర‌కు మాకు ల‌భించిన అవార్డులు, ప్ర‌శంస‌ల‌కంటే క్రిటిక్స్ అభినందించ‌డం పెద్ద అవార్డుగా భావిస్తున్నాం. విమ‌ర్శ‌కులు ఎప్పుడూ కూడా ద‌ర్శ‌కుల దృక్కోణం నుంచి ఆలోచిస్తూ విమ‌ర్శ‌లు చేస్తుంటారు. అప్పుడే క‌థ యొక్క కోషం చ‌దివే వారికి అర్థ‌మ‌వుతుంది. ఇంత లోతుగా ద‌ర్శ‌కుడిని ప‌రిశీలిస్తున్న వారిలో విమ‌ర్శ‌కులు మొద‌టి స్థానంలో ఉంటారు. అలాంటి విమ‌ర్శ‌కులే ఈ రోజు మ‌మ్మ‌ల్ని పిలిచి అభినందించ‌డం మాకు చాలా సంతోషంగా ఉంది. మ‌రింత బాధ్య‌త‌తో మ‌రిన్ని మంచి సినిమాల‌ని నిర్మిస్తామ‌ని తెలియ‌జేస్తున్నాను అన్నారు.

చిత్ర సమ‌ర్ప‌కులు నాగేశ్వ‌ర‌రావు పూజారి మాట్లాడుతూ మంచి మ‌న‌సుతో మంచి చిత్రానికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ వారు అభినందించ‌డం చాలా మంచి విష‌యం. సినిమాకు ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రు వారి వారి పాత్ర‌ల‌ని అద్భుతంగా నిర్వ‌ర్తించి మంచి చిత్రాన్ని అందించారు కాబ‌ట్టే నాలుగు గ‌ద్ద‌ర్ అవార్డులు వ‌చ్చాయి. మంచి చిత్రాన్నిఅందించిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత‌ల‌లో ఒక‌రైన రాహుల్ మోపిదేవి మాట్లాడుతూ ప్ర‌తీ ఆర్ట్ ఫామ్‌కు విమ‌ర్శ అన్న‌ది లేక‌పోతే అది సామాజిక స్పృహ కోల్పోతుంది. ఆ స్పృహ‌ని ప్ర‌తిబింబించాల‌న్నా..అది న‌డ‌వాల‌న్నా..ఒక ఆర్ట్‌కి విలువ ఏర్ప‌డాల‌న్నా..అది విమ‌ర్శ‌కుల ద్వారానే సాధ్య‌మ‌వుతుంది. మాకు ఈ అవ‌కాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇందులో న‌టించిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ఈ మూవీ కోసం ఎంతో కృషి చేశారు. ఈ ఆనందాన్ని మీలాంటి వారితో పంచుకోవ‌డం ఎంతో ఆనందించ‌ద‌గ్గ విష‌యం అన్నారు.

ద‌ర్శ‌కుడు సాయిలు కంపాటి మాట్లాడుతూ ఈ సినిమా నేను చూసిన జీవితాలు..అంటే ఇలాంటి క‌థ‌లు కూడా చెప్పొచ్చు అనిపించి రాసుకోవ‌డం మొద‌లు పెట్టిన‌. అంలాటిది ఇక్క‌డి దాకా వ‌స్తుంద‌ని నాకు తెలియ‌దు. సినిమా ఆడి ప్రొడ్యూస‌ర్‌కు డ‌బ్బులు వ‌స్తే చాలు అనుకున్నా. అవార్డ్స్ అన్న‌ది నాకు బోన‌స్‌. ఆడుతుందా లేదా అనుకున్నా. థ్యాక్స్ టు సినిమా. సినిమా అన్నీ ఇచ్చింది. సినిమా ఏదైనా చేయ‌గ‌ల‌దు. మీలాంటి మేము ఎంత బాగా తీసినా దాన్ని ప్రోత్స‌హించి పొగిడే వారు లేక‌పోతే వ్య‌ర్థ‌మే. మీలాంటి వాళ్లు మ‌మ్మ‌ల్ని ప్ర‌శంసిస్తే మ‌స్త్ అనిపిస్తుంది..మ‌జా వ‌స్తుంది. మ‌ళ్లీ మంచి సినిమాలు తీయాల‌ని మాకు ఎనర్జీనిచ్చిన మీకు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా మొద‌లు పెట్ట‌డానికి కార‌ణం ముఖ్య వ్య‌క్తి వేణు ఊడుగుల అన్న‌. వేణు అన్న లేక‌పోతే నేను లేను. ఎందుకంటే వేణు అన్న నాకు మంచి అవ‌కాశం ఇచ్చాడు. ఆయ‌న స‌హ‌కారాన్ని మ‌ర్చిపోలేను. అలాగే ఈటీవీ విన్ నితిన్‌, సాయిగారు, బాపినీడు గారూ, నిర్మాత రాహుల్ చాలా స‌హ‌క‌రించారు. ఫాద‌ర్ క్యారెక్ట్ అనుకున్న‌ప్పుడు నాకు శివాజీ రాజా గారే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టాను. నేను ఆయ‌న‌ని ముద్దుగా డాడీ అని పిలుస్తా. ఆయ‌న లేక‌పోతే ఫాద‌ర్ క్యారెక్ట‌ర్‌కు మ‌రొక‌రిని ఊహించుకోలేను అన్నారు.

న‌టుడు శివాజీ రాజా మాట్లాడుతూద‌ర్శ‌కుడిగా ముందు నుంచే ఈ సినిమాపై మంచి క్లారిటీ వుంది. త‌ను పేప‌ర్ మీదే సినిమా ఏంట‌న్న‌ది చూసేశాడు. సాయి కంపాటి చాలా పెద్ద ద‌ర్శ‌కుడు అవుతాడు. వేణు, సాయి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. గురుశిష్య‌లు అనుకోవ‌చ్చు..స్నేహితులు అనుకోవ‌చ్చు. అలాంటి ఇద్ద‌రు ల‌బించ‌డం ఇండ‌స్ట్రీ అదృష్టం. సినిమా హిట్ కాగానే నా క‌డుపు నిండిపోయింది. నా సినిమా హిట్ అయింది. గ‌ద్ద‌ర్ అవార్డులు రావ‌డంతో నా గుండె నిండిపోయింది అన్నారు.

చైతూ జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ నాకు వింత వింత‌గా కొత్త కొత్త‌గా అంతా అయోమ‌యంగా ఉంది. ఈ సినిమా స‌క్సెస్‌కు 70 శాతం కార‌ణం మీడియానే. ఎందుకంటే మీడియాకు న‌చ్చితేనే జ‌నాల‌కు న‌చ్చుతుంది. న‌టీన‌టులు పెర్ఫార్మెన్స్‌, మ్యూజిక్ గురించి బాగుంద‌ని అభినందించిన మీడియాకు థ్యాంక్స్‌. తొమ్మిది రోజుల్లో క్లైమాక్స్ తీశారు. ఫ‌స్ట్ టైమ్ డైరెక్ట‌ర్ సాంగ్ లేదా.. కామెడీ సీన్ తీస్తారు కానీ డైరెక్ట‌ర్ రాము తీసిన ఫ‌స్ట్ సీన్ క్లైమాక్స్‌. అన్ని చాలా క‌ష్ట‌పెట్టిన వ్య‌క్తిని నేనే అన్నారు.

అనితా చౌద‌రి మాట్లాడుతూ ఈ ఘ‌న‌త అంతారాజు వెడ్స్ రాంబాయిప్రొడ్యూస‌ర్స్‌కి, న‌టీన‌టులు, టెక్నిక‌ల్ టీమ్‌కు ద‌క్కుతుంది. స్క్రిన్ మీది క‌నిపించిన వాళ్ల క‌న్నా స్క్రిన్ వెన‌క ప‌ని చేసిన వారి హార్డ్ వ‌ర్డ్ వంద రెట్లు ఎక్కువ పెట్టిన సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్త‌వుతుంది? అనే డౌట్ ఉండేది. డైరెక్ట‌ర్ దీని గురించి ఆలోచిస్తూ క‌ళ్లు తిరిగిప‌డిపోయిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. ఛ‌త్ర‌ప‌తి సినిమా చేశాక అలాంటి క్యారెక్ట‌ర్ చేయ‌లేద‌నే భావ‌న ఉండేది. అది ఈ సినిమాతో తీరింది అన్నారు.

ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు బ‌త్తుల జేవీ ప్ర‌సాద్‌ మాట్లాడుతూ శివాజీ రాజా అన్న ఈ సినిమాలో ఏడిపించాడు. ఈ సినిమా తెలంగాణ సినిమా అంటున్నారు. ఇది తెలంగాణ సినిమా కాదు. ఇది అన్ని ప్రాంతాల్లో ఉన్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవితాలివి. ఆ జీవితాల‌ను యాజిటీజ్‌గా చూపించారు. నేను స్వ‌త‌హాగా క‌థ‌కుడిని. నా మొద‌టి పుస్త‌కంస‌గిలేటి క‌థ‌లు. ఈ ప‌గిలేటి క‌థల్లో నేనోక‌థ రాశాను. మానంసం తిని చ‌చ్చిపోత‌నా? అనే క‌థ‌లోని సిమిలారిటీ ఇందులోని ఓ స‌న్నివేశంలో క‌నిపించింది. నేను రాయ‌ల‌సీమ వాడిని. నేను యుక్త‌వ‌య‌సులో ఏం చూశానో అవ‌న్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ప్ర‌తి ఒక్క ప‌ల్లెటూరి వ్య‌క్తి సొంతం చేసుకునే క‌థ ఇది. ప్రాంతాల‌కు, భాష‌ల‌కు, యాస‌ల‌కు అతీతంగా రూపొందిన అద్భుత‌మైన సినిమా ఇది. ఇందులో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులంద‌రినీ అభినందిస్తున్నాను అన్నారు.

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సురేష్ కొండేటి మాట్లాడుతూ కొన్ని సినిమాలు మ‌నం చూస్తున్న‌ప్పుడే క‌చ్చితంగా అవార్డు వస్తుంద‌ని ఊహిస్తాం. సినిమా చూస్తున్న‌ప్పుడే ఆ ప‌ల్స్ మ‌న‌కి తెలిసిపోతుంది. కొన్ని అవార్డు ద‌క్కించుకున్న‌వి క‌మ‌ర్షియ‌ల్‌గా ఆడటం త‌క్కువ‌. కానీ ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ సాధించింది. ఈ సినిమాకు గ‌ద్ద‌ర్ ఈవార్డ్స్ వ‌చ్చిన సంద‌ర్భంగా కాక‌పోయినా ఫిల్మ్ క్రిటిక్స్ సార‌థ్యంలో అభినంద‌న స‌భ ఏర్పాటు చేయాల‌నుకున్నాం. ఫిల్మ్ క్రిటిక్స్ అసోషియేష‌న్ అభినందించిందంటే ఐఎస్ఐ స్టాంప్‌లా అప్ప‌ట్లో భావించే వారు. అప్ప‌ట్లో గుడిపూడి శ్రీ‌హ‌రి లాంటి పెద్ద పెద్ద వాళ్లు ఉండేవారు. వాళ్లు చేసిన క్యార్య‌క్ర‌మాలు చాలా చూసీ ఇప్పుడు ప్ర‌భుగారి ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం జ‌రిగింది. మూడేళ్ల క్రితంబ‌ల‌గంసినిమాని ఈ అసోసియేష‌న్ ప్ర‌త్యేకంగా అభినందించ‌డం జ‌రిగింది. మూడేళ్ల త‌రువాత మ‌ళ్లీరాజు వెడ్స్ రాంబాయిసినిమాని అభినందిస్తున్నాం. ఫిల్మ్ క్రిటిక్స్ అసోషియేష‌న్ ఎప్పుడూ మంచి చిత్రాల‌ని ప్రోత్స‌హిస్తూనే ఉంటుంది అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రాఫ‌ర్ వాజిద్ బేగ్‌, ఎడిట‌ర్ న‌రేష్ అడుప‌, అనితా చౌద‌రి, క‌విత శ్రీ‌రంగం, విక్ర‌మాదిత్య త‌దిత‌రులు పాల్గోన్నారు.

ప్ర‌శ్న – జ‌వాబు

ఈ క‌థ ద‌ర్శ‌కుడు చెప్పిన‌ప్పుడు మీకు న‌మ్మ‌కం క‌ల‌గ‌టానికి అందులో దోహ‌దం చేసిన అంశాలు ఏమిటీ?

వేణు ఊడుగుల‌- మొద‌ట నేను ప్రొడ‌క్ష‌న్ చేయాల‌ని అనుకోలేదు. భ‌విష్య‌త్తులో ప్రొడ్యూస్ చేయాల‌నే ఆలోచ‌న ఉండే కానీ ఇప్పుడే ప్రొడ్యూస‌ర్ కావాల‌నే ఆలోచ‌న నాకు లేదు. అదే టైమ్‌లో సాయిలు కంపాటి నా ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్గా ప‌ని చేయ‌డం కోసం వ‌స్తుండే వాడు. సురేష్ బొబ్బిలి అత‌న్ని నా ద‌గ్గ‌రికి తీసుకొచ్చాడు. అత‌ను మాట్లాడుతుంటే, అత‌ను మాట్లాడే విధానంలో నాకు నిజాయితీ క‌నిపించింది. అత‌ను మాట్లాడ‌ట‌మే హృద‌యంతో మాట్లాడుతున్న‌ట్టుగా అనిపించింది. వీడెవ‌డో మ‌న‌లాడే ఉన్నాడే అనిపించింది. అప్పుడు అత‌న్ని ర‌మ్మ‌ని చెప్పాను. అప్పుడు త‌ను ఒక సంఘ‌ట‌న జ‌రిగింది అని చెప్పాడు. బాగుందే రానీ ఫ‌స్ట్ సినిమా రిస్క్ ఏమో ఒక‌సారి ఆలోచించు. నేనైతే నీకు క‌చ్చితంగా స‌హ‌యం చేస్తా. సినిమా మెటీరియ‌లైజ్ కావ‌డానికి నేను స‌హ‌యం చేస్తా. అయితే ఫ‌స్ట్ సినిమా రిస్క్ అవుత‌దేమో ఆలోచించు అన్నాను. తేద‌న్నా మీరు క‌థ విన్నండి.విన్న త‌రువాత చెప్పండి అన్నాడు. నెక్స్ట్ డే క‌థ చెప్పిన‌ప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌న‌ని క‌థ‌గా విన్న‌ప్పుడు నాకు బాగా న‌చ్చింది. బాగా ఎట్రాక్ట్ అయిన‌. దీన్ని ప్రొడ్యూస్ చేస్తా అని మాటిచ్చిన. ఎందుకంటే డైరెక్ట‌ర్స్ రెండు ర‌కాలు. ఒక‌రు మైండ్‌తో చేస్తే మ‌రొక‌రు హార్ట్‌తో చేస్తారు. హార్ట్ ఇంట‌లిజెంట్స్ ఉంటారు. హార్ట్ ఇంటలిజెన్స్‌తో జ‌నాల్ని ఆక‌ట్టుకోగ‌లుగుతారు. హృద‌యాన్ని ట‌చ్ చేయ‌గ‌ల‌రు. రాము క‌థ‌ని రాసిన విధానంలో హార్ట్ ఇంట‌లిజెన్స్ న‌న్ను ఎట్రాక్ట్ చేసింది. వెంట‌నే నేను అప్పుడు ఈటీవీ విన్ వారికి నేను ఈ క‌థ‌ని పిక్ చేశాను. చెప్ప‌గానే వాళ్లు ఒప్పుకోవ‌డం కూడా అదృష్టం. వారు అంగీక‌రించ‌క‌పోతే నేను ఇంత త్వ‌ర‌గా ప్రొడ్యూస‌ర్‌ని అయ్యేవాడిని కాదు.వాళ్ల‌కు ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను.

చైత‌న్య గారు మిమ్మ‌ల్ని బ‌య‌ట చూసి స్క్రీన్‌పై చూస్తే షాకింగ్‌గా ఉంది. యాక్టింగ్‌లో ఏమైన ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ తీసుకున్నారా?

చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌- అలాంటిది ఏమీ లేదు. నాకు యాక్టింగ్ రాదు కాబ‌ట్టే నేచుర‌ల్‌గా న‌టించ‌గ‌లిగానేమో.

వేణు ఊడుగుల గారు నిర్మాత‌గా ఇలాగే కొన‌సాగుతారా? ద‌ర్శ‌కుడిగా కొన‌సాగుతూనే నిర్మాణం కూడా కంటిన్యూ చేస్తారా?

ఇంత‌కు ముందు పెట్టుబ‌డి క‌థ‌ల‌ని నిర్ణ‌యించేది. కానీ ఇప్పుడు క‌థ‌లే పెట్టుబ‌డిని నిర్ణ‌యించే సానుకూల‌మైన‌టువంటి వాతావ‌ర‌ణంలో ఇండ‌స్ట్రీ వుంది కాబ‌ట్టి ప్రొడ‌క్ష‌న్‌ని కొన‌సాగిస్తాను. ప్ర‌స్తుతం ఒక‌టి రెండు ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్నాయి. అయితే డైరెక్ష‌న్ కే నా తొలి ప్రాధాన్య‌త‌.

చాలా మంది ద‌ర్శ‌కులు నిర్మాత‌లుగా బాధ్య‌త‌లు చేప‌ట్టాలంటే చాలా రిస్క్‌గా భావిస్తున్నారు. అనిల్ రావిపూడి కూడా ఆ ఒక్క‌టి త‌ప్ప ఏదైనా చేస్తాను అంటున్నారు. ఆయ‌న ప్రొడ‌క్ష‌న్‌లోకి రావ‌డానికి ఆస‌క్తిని చూపించ‌డం లేదు. అలాగే చాలా మంది ప్రొడ్యూస‌ర్లు డైరెక్ష‌న్ నా వ‌ల్ల కాదు అంటూ దూరంగా ఉంటున్నారు. మీ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణంలో మిమ్మ‌ల్ని ఏది డామినేట్ చేసింది? ఏది ఇష్టంగా అనిపించింది?

వేణు ఊడుగుల‌- డైరెక్ష‌న్ అనేది నా మెయిన్ ఎక్స్‌ప్రెష‌న్‌. నేను చెప్పాల‌నుకున్న క‌థ‌ల్ని నా డైరెక్ష‌న్‌లో చెప్పాల‌నుకుంటాను. నిర్మాణం అనేది డైరెక్ష‌న్ నుంచి నిర్మాణం వైపు షిఫ్ట్ అవ్వ‌డం కాదు. అదొక నా కెరీర్‌ ఎక్స్‌టెన్ష‌న్. ఇప్పుడున్న ప‌రిస్థితుల‌ల్లో రాహుల్ మోపిదేవి, నాగేశ్వ‌ర‌రావు పూజారి లాంటి వ్య‌క్తుల స‌పోర్ట్ నాకు ఉంది కాబ‌ట్టి కంటెంట్ బేస్డ్ చిన్న సినిమాలు చేయాల‌నుకుంటున్నాను.

పూజారి నాగేశ్వ‌ర‌రావు గారు మీ ప్రొఫెష‌న్‌లో ఎంతో బిజీగా ఉన్న మీరు నిర్మాణ రంగం వైపు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటీ?

నాగేశ్వ‌ర‌రావు పూజారి – మంచి క‌థ. దీన్ని జ‌నాల‌కు చెప్పాల‌ని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను. ఎందుకంటే సినిమాల‌తో స‌మాజంతో మార్పు తీసుకురావాల‌న్న‌దే నా ఉద్దేశ్యం. నేను నాలుగు గోడ‌ల మ‌ధ్య మాట్లాడితే ఎవ‌రికీ అర్థం కాదు. నేను చెప్పే సందేశం చాలా మందికి రీచ్ కాదు. స‌మాజంలో మార్పు తేవ‌డానికి క‌ల అన్న‌ది ప్ర‌ధాన కార‌ణం కాబ‌ట్టి మంచి క‌థ‌ల‌ని జ‌నాల‌కు అందించాల‌నే ఉద్దేశ్యంతోనే నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశించ‌డం జ‌రిగింది.

శివాజీరాజాగారూ ఎన్నో పాత్ర‌లు ఆల్ రెడీ మీరు చేసి ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో అద్భుత‌మైన క్యారెక్ట‌ర్లు చేశారు. ఈ సినిమా ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్పుడు ఈ మూవీ గెట‌ప్ చూపించిన‌ప్పుడు నేను ఆశ్చ‌ర్య‌పోయాను. ఈ క్యారెక్ట‌ర్ చేసిన‌ప్పుడు మిమ్మ‌ల్ని మ‌రో మెట్టు ఎక్కిస్తుంద‌నే భావ‌న మీకు క‌లిగే ఉంటుంది. ఈ సినిమా విష‌యంలో మీకు ల‌భించిన మ‌ర్చిపోలేని మెమొర‌బుల్ ఇన్సిడెంట్స్ గురించి ఏమైనా చెబుతారా?

శివాజీ రాజా – ఈ సినిమానే ఓ మెమొర‌బుల్ ఇన్సిడెంట్‌. ఇన్ని సినిమాలు చేసినా కూడా తెలంగాణ‌లో మారుమూల గ్రామాల‌కు వెళ్లి చేయ‌డం అనేది చాలా త‌క్కువ‌. నాకు క‌ష్టం అనిపించింది. డైరెక్ట‌ర్ రాము చిన్న చిన్న వాటిని కూడా ప‌ట్టుకోవ‌డం క‌ష్టం అనిపించింది. పైకి అలా ఉంటాడు కానీ ఒక్క సారి షాట్ రెడీ అన‌గానే ప్ర‌తి చిన్న విష‌యాన్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తాడు. అత‌నితో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. కొన్ని సీన్‌ల‌లో డ‌బ్బింగ్‌లో స‌రి చేసుకున్నాను.

చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌.. హీరోగా మీ సోద‌రుడు సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ ఎంత పేరు తెచ్చుకున్నారో ఈ ఒక్క క్యారెక్ట‌ర్‌తో మీరు అంత పేరు తెచ్చుకున్నారు. న‌న్ను ఈ ఒక్క క్యారెక్ట‌ర్‌తో మింగేశావ‌ని అన్నారా?

చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌- ఈ స్థాయికి రావ‌డానికి నేను ఎనిమిదేళ్లు క‌ష్ట‌ప‌డ్డాను. నువ్వు వ‌చ్చిన మూడేళ్ల‌కే ఇంత పేరొచ్చింది. అవార్డు కూడా ఇచ్చారు.

అవార్డులు వ‌స్తాయ‌ని ఊమించారా?

చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌- లేదండీ అస్స‌లు ఊహించ‌లేదు. అవార్డులు ప్ర‌క‌టించిన రోజు వ‌రుసగా ఫోన్‌లు వ‌స్తున్నాయి. వేణు ఊడుగుల అన్న ఏమో ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. ఏమైంది అంటే ఒక‌సారి న్యూస్‌లో ఏమొస్తుందో చూసుకో అన్నాడు. న్యూస్ చూసి షాక్ అయ్యాను.

నాగేశ్వ‌ర‌రావు పూజారి గారు మీరు బిజీయెస్ట్ లాయ‌ర్. అలాంటి మీరు ఈ సినిమా ప్రొడ‌క్ష‌న్‌లోకి రావాల‌నే మీ ఆలోచ‌నకు స్ఫూర్తి ఏమీటి?

మ‌నిషికీ సినిమాకు అవినాభావ సంబంధం ఏందంటే ఊపిరి. సినిమా అనేది ఊపిరి. ప్ర‌పంచంలో ఎక్క‌డున్నా కూడా జ‌సినిమా అనేది జ‌నాల‌ని ప్ర‌భావితం చేస్తుంది కాబ‌ట్టి ఆ జ‌నాల‌లో మార్పుని చూడ‌టానికి సినిమా ద్వారా ఆ మార్పుని తీసుకురావాల‌నే ఉద్దేశ్యంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను.

తొలి సినిమాతో అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించారు కాదా.. మీ ప్ర‌యాణం ఎలా ఉండ‌బోతోంది? ప‌్రొడ్యూస‌ర్‌గా కొన‌సాగుతారా?

నాగేశ్వ‌ర‌రావు పూజారి- ఖ‌చ్చితంగా. ఫ‌స్ట్ నేను మా వేణు ఊడుగుల అన్న‌కు అభినంద‌న‌లు చెప్పాలి. ఎందుకంటే తొలి సినిమాతోనే థియేట‌ర్లో పేరు ప‌డిబ్లాక్ బ‌స్ట‌ర్ అయి గ‌ద్ద‌ర్ అవార్డ్స్ వ‌చ్చాయి కాబ‌ట్టి చాలా సంతోషంగా ఉన్నాను. దీని త‌రువాత మా ప్రొడ‌క్ష‌న్‌లో కంటిన్యూగా మా వేణు అన్న స‌హ‌కారంతో సినిమాలు చేస్తాం. ప్ర‌స్తుతం మూడు నాలుగు సినిమాలు ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్నాయి.

రాహుల్ మోపిదేవి…మీరు యంగ్ ప్రొడ్యూస‌ర్‌. మీ పేరు చెప్ప‌గానే పెద్దాయ‌న అనుకున్నాం. మీరు చూస్తే చాలా యంగ్ గా ఉన్నారు. మీ మొద‌టి సినిమాకే ఇలాంటి అప్లాజ్ రావ‌డంఎలా అనిపించింది? గ‌తంలో ఏదైనా అనుభ‌వం ఉందా?

గ‌తంలో ఒక‌టి రెండు సినిమాలు చేసిన అనుభ‌వం ఉంది. అయితే ప్రొడ‌క్ష‌న్ ప‌రంగా మాత్రం ఇదే ఫ‌స్ట్ మూవీ. చాలా నేర్చుకున్నాను.

TFJA

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

3 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago