రామసత్యనారాయణసృష్టించేచరిత్రలోమేము సైతం పాలుపంచుకుంటాం!! సీనియర్ హీరో సుమన్

15 చిత్రాలకూ స్టూడియో పార్టనర్ గా కె.ఎల్.ఫిల్మ్ స్టూడియో

ఒకే రోజు 15 సినిమాలకు శ్రీకారం చుడుతూ ప్రపంచ రికార్డు సాధించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న భీమవరం టాకీస్ అధినేత – శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ వెనుక తాము ఉంటామని తెలిపారు… ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, సీనియర్ హీరో సుమన్, ప్రఖ్యాత రచయిత జె.కె.భారవి. ఈనెల (ఆగస్టు) 15న హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఒకేసారి ప్రారంభమై ప్రపంచ రికార్డు” నెలకొల్పనున్న 15 సినిమాలకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరంతా సంఘీభావం తెలిపారు. ఈ 15 చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సుమన్ ప్రకటించగా… ఈ 15 చిత్రాల్లో యండమూరి సినిమా మినహా… మిగతా సినిమాలకు తాను స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ గా వ్యవహరించి తగిన సలహాలు, సూచనలు ఇస్తానని జె.కె.భారవి పేర్కొన్నారు. రామసత్యనారాయణను చూసి తాను గర్వపడుతుంటానని రేలంగి తెలిపారు. ఈ 15 చిత్రాలకు స్టూడియో పార్టనర్ గా ఉండే అవకాశం లభించడం గర్వంగా ఉందన్నారు కె.ఎల్. ఫిల్మ్ స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్. కెరీర్ బిగినింగ్ లొనే 12 నెలల్లో 13 సినిమాలు తీసి, విడుదల చేసి రికార్డు క్రియేట్ చేసిన తనకు…ఒకేసారి 15 సినిమాలు స్టార్ట్ చేసి, ఏడాదిలోపు పూర్తి చేసి విడుదల చేయడం ఎంతమాత్రం కష్టసాధ్యం కాదని తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. ఈ 15 సినిమాల్లో… యండమూరి వీరేంద్రనాధ్ వంటి మహా రచయిత చిత్రంతోపాటు… జె.కె.భారవి వంటి మహాజ్ఞాని చిత్రం… ప్రఖ్యాత దర్శకుడు ఓం సాయి ప్రకాష్ చిత్రం ఉండడం చాలా గర్వంగా ఉందని తుమ్మలపల్లి చెప్పారు. ఈ 15 చిత్రాల్లో కేవలం రెండుమూడు చిత్రాలు ప్రజాదరణకు నోచుకున్నా… తాను పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో…15 చిత్రాల దర్శకుల్లో పన్నెండు మంది హాజరై… రామసత్యనారాయణ గారు ఇస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రాణం పెట్టి పనిచేస్తామని ప్రతిన పూనారు.ఈ 15 చిత్రాలకు “పి.ఆర్.ఓ” అయిన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ అప్పాజీ కూడా పాల్గొన్నారు!

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

7 days ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago