నవంబర్ 1న రాబోతోన్న ‘ఉగ్రావతారం’

ఎస్‌జీఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రియాంక ఉపేంద్ర సమర్పణలో ఎస్.జి. సతీష్ నిర్మాతగా గురు మూర్తి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం ‘ఉగ్రావతారం’. ఈ చిత్రంలో ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్‌లో నటించారు. సుమన్, నటరాజ్ పేరి, అజయ్, పవిత్రా లోకేష్, సాయి ధీనా, సుధి కాక్రోచ్, లక్ష్య శెట్టి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్, ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు, నటుడు సత్య ప్రకాష్, నిర్మాత రాజ్ కందుకూరి సందడి చేశారు. కరాటే రాజు, సత్య ప్రకాష్ చేతుల మీదుగా పాటను విడుదల చేయించారు. అనంతరం రాజ్ కందుకూరి ట్రైలర్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఉగ్రావతారం వంటి కంటెంట్ దసరాకి రావాల్సిన సినిమా. ఫీమేల్ ఓరియెంటెడ్‌గా తీసిన ఈ చిత్రం దసరాకి వస్తే ఇంకా బాగుండేది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాటిని చూపిస్తూ తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. గురు మూర్తి ఇది వరకు తీసిన చిత్రాలు కూడా బాగుంటాయి. నవంబర్ 1న రాబోతోన్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. ప్రియాంక ఉపేంద్రకు మంచి సక్సెస్ రావాలి. ఇలాంటి చిత్రాలను మీడియా ముందుండి నడిపించాలి’ అని అన్నారు.

ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ.. ‘నాకు హైద్రాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఉపేంద్ర గారిని ఫస్ట్ టైం ఇక్కడే కలిశాను. హైద్రాబాద్ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరిర్‌లో ఇదే ఫస్ట్ యాక్షన్ ఫిల్మ్. గురు మూర్తి గారి వల్లే ఈ మూవీని చేశాను. నేను ఈ పాత్రకు సెట్ అవుతాను అని ఆయనే నమ్మారు. కెమెరామెన్ నందకుమార్ అందరినీ బాగా చూపించారు. నటరాజ్ అద్భుతంగా నటించాడు. రాజు గారు తెలుగులో మంచి పాటలు, మాటలు ఇచ్చారు. కృష్ణ బస్రూర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నవంబర్ 1న మా చిత్రం రాబోతోంది.నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.

గురు మూర్తి మాట్లాడుతూ.. ‘సమాజంలో జరిగే అన్యాయాల్ని, అఘాయిత్యాల్ని మీడియా ప్రశ్నించి ఎదురించగలదు. మా ఈ చిత్రాన్ని అటువంటి సమస్యల మీదే తీశాను. మంచి సందేశాత్మాక చిత్రంగా ఉంటుంది. ప్రియాంక మేడం కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. నటరాజ్ అద్భుతంగా నటించాడు. నవంబర్ 1న రానున్న మా చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.

నటుడు సత్య ప్రకాష్ మాట్లాడుతూ.. ‘కలకత్తా కాళి గురించి అందరికీ తెలిసిందే. మన ప్రియాంక గారు కలకత్తా బిడ్డ. కర్తవ్యంలో విజయశాంతి గారిని చూసి ఎలా అనుకున్నారో.. ఈ మూవీ తరువాత ప్రియాంక గారిని అలా అనుకుంటారు. ఈ మూవీ తరువాత ప్రతీ ఇంట్లోకి ప్రియాంక గారు వెళ్తారు. మనమంతా కలిసి ఆమెను సపోర్ట్ చేద్దాం. ఈ చిత్రంలో నా కొడుకు నటించాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. గురు మూర్తి చాలా డెడికేటెడ్ డైరెక్టర్. నవంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

నటరాజ్ మాట్లాడుతూ.. ‘సతీష్ గారు నిర్మించిన ఈ చిత్రానికి ప్రియాంక ఉపేంద్ర గారు సమర్పకురాలు. గురు మూర్తి గారు ఈ మూవీని అద్భుతంగా రాసుకుని తెరకెక్కించారు. నంద కుమార్ మంచి విజువల్స్ ఇచ్చారు. కృష్ణ బస్రూర్ సంగీతం అదిరిపోతుంది. ఇది కంటెంట్ బేస్డ్ మూవీ. మహిళలకు జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలను అమ్మవారు వచ్చి కాపాడితే ఎలా ఉంటుందనేది ఈ చిత్రంలో ఉంటుంది. ప్రియాంక గారు అద్భుతంగా నటించారు. మా చిత్రం నవంబర్ 1న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

కరాటే రాజు మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సినిమాకు భాష లేదు. కంటెంట్ బాగుంటే అన్ని భాషల ఆడియెన్స్ చూస్తున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 1న రాబోతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.

కిన్నాల్ రాజు మాట్లాడుతూ.. ‘ఉగ్రావతారంలోని ఫీల్, సోల్ మిస్ అవ్వకూడదని పాటలు, మాటలు రాశాను. ఇలాంటి మంచి చిత్రానికి మీడియా నుంచి సహకారం ఉండాలి. నవంబర్ 1న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

2 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago