టాలీవుడ్

VS10 అనౌన్స్ మెంట్-  గ్రాండ్ గా ప్రారంభం

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ విభిన్నమైన జోనర్‌ల సినిమాలతో అలరిస్తున్నారు. తన 10వ సినిమా కోసం, నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడితో కలిసి విశ్వక్ సేన్ చేతులు కలిపారు.    ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు.

అందరి దృష్టిని ఆకర్షించే పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ రోజు #VS10ని అధికారికంగా అనౌన్స్ చేశారు. పలువురు ప్రత్యేక అతిథులు సమక్షంలో ఈ చిత్రం ఈరోజు గ్రాండ్‌గా ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రామ్‌ తాళ్లూరి భార్య రజనీ క్లాప్‌ ఇవ్వగా, రచయిత, దర్శకుడు మచ్చ రవి కెమెరా స్విచాన్‌ చేశారు. దర్శకుడు రవితేజ ముళ్లపూడి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. అంతకుముందు రామ్ తాళ్లూరి ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు.

కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ సాగే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది.

ప్రారంభోత్సవం సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. రామ్ తాళ్లూరి నా ఫేవరేట్ ప్రొడ్యూసర్. ఇది నా పదో చిత్రం. ఇది కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో కెల్లా భిన్నంగా వుంటుంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. కొత్త దర్శకుడు రవితేజ చాలా టాలెంటెడ్. సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు

దర్శకుడు రవితేజ మాట్లాడుతూ.. నన్ను నమ్మి సినిమా ఇచ్చిన విశ్వక్ సేన్ గారికి, నిర్మాత  రామ్ తాళ్లూరి గారికి కృతజ్ఞతలు’’ తెలిపారు

మీనాక్షి చౌదరి మాట్లాడుతూ: రామ్ తాళ్లూరి నిర్మాణంలో సినిమా చేయడం చాలా ఎక్సయిటింగా వుంది. విశ్వక్ సేన్ గారితో ఎప్పటి నుంచో పని చేయాలని వుండేది. ఈ సినిమాతో అది కుదిరింది. చాలా మంచి స్క్రిప్ట్. చాలా మంచి పాత్ర. ఇంత మంచి టీం తో కలసి పని చేయడం చాలా ఎకయిటింగా వుంది’’ అన్నారు

నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ నాకు ఇష్టమైన హీరో. ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాం. ఏడాది క్రితం  రవితేజ ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. విశ్వక్ ఏ కథ ఎంచుకున్న తర్వాత ఇంకా నమ్మకం పెరిగింది. ఈ సినిమాని  ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు తగ్గకుండా వుంటుంది. పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు

ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ కటసాని డీవోపీగా పని చేస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్ , విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు.

#VS10 వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలౌతుంది.  

తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
నిర్మాత: రామ్ తాళ్లూరి
ప్రొడక్షన్ బ్యానర్: ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డివొపి: మనోజ్ కటసాని
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
ఎడిటర్: అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యుసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె
కాస్ట్యూమ్ డిజైనర్: కళ్యాణి
సౌండ్ డిజైనర్: నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ కంట్రోలర్: శరత్ పాలంకి
ప్రొడక్షన్ మేనేజర్ : శ్రీహరి పెద్దమల్లు
పీఆర్వో: వంశీ- శేఖర్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

9 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago