భార్యాభర్తల పోరుని వినోదాత్మకంగా చూపించిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాంటి ఫ్యామిలీ కథతో వచ్చే కామెడీ ఎంటర్టైనర్‌లు ఎవర్ గ్రీన్‌గా నిలుస్తుంటాయి. ఇక ఇప్పుడు అలాంటి ఓ కథతోనే ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో ‘పురుష:’ అనే చిత్రం రాబోతోంది. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మామూలుగా అయితే సినిమా నుంచి టీజర్, ట్రైలర్‌లాంటి కంటెంట్‌లు బయటకు వస్తే ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంటుంది.
కానీ ‘పురుష:’ టీం మాత్రం కేవలం పోస్టర్లు, ఫస్ట్ లుక్స్‌తోనే జనాల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు హీరోల పాత్రలు, వారి బిహేవియర్, పాత్రల తీరుకి తగ్గట్టుగా పరిచయం చేసిన పోస్టర్లు అందరినీ నవ్వించేశాయి. ఇక ఇప్పుడు హీరోయిన్ల పాత్రల స్వభావాన్ని తెలియజేసేలా పోస్టర్లను విడుదల చేస్తూ అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తున్నారు.
ఈ క్రమంలో హీరోయిన్ వైష్ణవి పాత్రని ‘కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా’ అని పరిచయం చేశారు. అంటే ఆ పాత్ర పూర్తి ఎమోషనల్‌గా సాగేలా ఉంది. ‘పాపం అల్లాడి పోతున్నాడమ్మ బిడ్డ’ అనే క్యాప్షన్‌తో హాసిని పాత్రని పరిచయం చేశారు. ఇక ఆమె పాత్ర పూర్తి రెబల్‌గా ఉంటుందని అర్థం అవుతోంది. ఇక విషిక కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. వైష్ణవి, హాసిని కంటే విషిక పాత్ర మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా కనిపిస్తోంది. విషిక చేతిలో కసిరెడ్డి రాజ్ కుమార్ నలిగిపోయేలా ఉన్నాడు.
కాలితో తంతే.. గాల్లోకి ఎగిరాడు అన్నట్టుగా విషిక పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. దమ్ముంటే టచ్ చేసి చూడు అంటూ టీ షర్ట్ మీద కనిపిస్తున్న క్యాప్షన్ చూస్తుంటే విషిక ఈ మూవీలో రఫ్ఫాడించేలా ఉంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్‌గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని టీం చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
నటీనటులు : పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్, శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, వి.టి.వి. గణేష్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : కళ్యాణ్ ప్రొడక్షన్స్
నిర్మాత : బత్తుల కోటేశ్వరరావు
దర్శకుడు : వీరు వులవల
సంగీత దర్శకుడు : శ్రవణ్ భరద్వాజ్
కెమెరామెన్ : సతీష్ ముత్యాల
ఎడిటర్ : కోటి
ఆర్ట్ : రవిబాబు దొండపాటి
లిరిక్స్ : అనంత శ్రీరామ్
పీఆర్వో : సాయి సతీష్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…