నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె.విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో తాజాగా రూపొందిన మరో లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఉషా పరిణయం లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. కె.విజయ్‌భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్యతారలు. ఆగస్టు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత విజయభాస్కర్ మాట్లాడుతూ ‘చాలా రోజుల తరువాత ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చూశామని ప్రేక్షకులు అంటుంటే ఆనందంగా వుంది. నువ్వు నాకు నచ్చావ్ తరహాలో వినోదంతో పాటు నువ్వేకావాలి లాంటి టీనేజ్ లవ్‌స్టోరీ ఈ చిత్రంలో వుందని అందరూ అంటున్నారు.
చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మౌత్‌టాక్‌తో ఇది మరింత మందికి చేరువ అవుతుందని నమ్మకం వుంది. కలెక్షన్లు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇలాంటి చిన్న సినిమాలను ఆదరిస్తే మరిన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు వస్తాయి. ఈచిత్రంతో హీరో, హీరోయిన్లకు నాకంటే ఎక్కువ పేరు వచ్చింది’ అన్నారు. హీరో శ్రీకమల్ మాట్లాడుతూ సినిమా చూసిన అందరూ నా నటన, డ్యాన్సుల గురించి మాట్లాడుతున్నారు. అందరం ఎంతో కష్టపడి సినిమా చేశాం. ఈ రోజు ఫలితం చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంది. కలెక్షన్లు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాం’ అన్నారు. హీరోయిన్ తాన్వీ ఆకాంక్ష మాట్లాడుతూ సినిమా ప్రివ్యూ చూసిన అందరి నుండి చాలా పాజిటివ్ స్పందన వచ్చింది. ఓ మంచి చిత్రంలో హీరోయిన్‌గా నటించినందుకు సంతోషంగా వుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు విజయ్‌భాస్కర్ గారికి థ్యాంక్స్’ అన్నారు. సినిమా చూసిన తరువాత చాలా రోజుల తరువాత మంచి సంగీతంతో కూడిన పాటలు చూశామని ఎమోషన్‌గా చెబుతుంటే నాకు ఎంతో గర్వంగా వుంది. ఈచిత్రంలో ప్రతి పాటకు చక్కని సాహిత్యం, ట్యూన్స్ కుదిరాయి. నా కెరీర్‌లో ఇదొక మరుపురాని చిత్రంగా నిలుస్తుందని సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధ్రువన్ తెలిపారు
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…