విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల ‘విడుదల-2’: నిర్మాత చింతపల్లి రామారావు

సామాన్యుల నుంచి ఉద్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ కథే, విజయ సేతుపతి, వెట్రీమారన్‌ల ‘విడుదల-2’ : నిర్మాత చింతపల్లి రామారావు
విజయ్ సేతుపతి, వెట్రీమారన్‌ కలయికలో రూపొందిన ‘విడుదల -1’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘విడుదల-2’. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. ప్రముఖ నిర్మాత , శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు. ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను కథానాయకుడు విజయ్‌ సేతుపతి ఇటీవల చెన్నయ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం ఈ చిత్రం విశేషాలను తెలియజేయడానికి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు నిర్మాత. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ ” ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ట్రయిలర్‌తో పాటు పాటల్లో కూడా మంచి టెంపో ఉంది. ఈ చిత్ర కథాంశాన్ని చెప్పాలంటే.. ”

పరిపాలకుల అహంకారానికి అణచివేయబడిన సామాన్యుల నుంచి ఉధ్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ గాథే ‘విడుదల-2’. ఈ చిత్రం తమిళ చిత్రం కాదు. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. ఈ చిత్రంలో పెరుమాళ్‌ పాత్రకు సేతుపతి నూటికి నూరు శాతం సరిపోయాడు. నక్సెలైట్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి నటన, పాత్రలోని ఎమోషన్‌ ఆయన పండించిన విధానం అద్భుతం. నటుడిగా విజయ్‌ సేతుపతి ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపు ఉంది. ఈ చిత్రం ఆయన పేరు మరింత పెరుగుతుంది. ఏడు సార్లు నేషనల్‌ అవార్డు అందుకున్న వెట్రీమారన్‌ దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అగ్రహీరోలదరూ ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. ఇక ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా ప్రళయం లాంటి సంగీతాన్ని అందించారు.


ఇక విజయ్‌, వెట్రిమారన్‌, ఇళయరాజా ఇలాంటి కాంబినేషన్‌లో సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ చిత్రంలో పీటర్‌ హెయిన్స్‌ ఇప్పటి వరకు ఇండియన్‌ స్క్రీన్‌పై చూడని పోరాటాలు సమాకూర్చాడు, మంజు వారియర్‌ సహజ నటన ఈ చిత్రానికి ప్లస్‌ అవుతుంది. విజయ్‌, మంజు వారియర్‌ మధ్య ఎమోషన్స్‌ సీన్స్‌ అద్భుతంగా ఉంటాయి. ఆ సన్నివేశాలు అందర్ని కంటతడిపెట్టిస్తాయి. డిసెంబర్‌ 20న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సాధిస్తుంది’ అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ చిత్రం ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకవెళుతుంది. తప్పుకుండా ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధిస్తుంది అన్నారు. విడుదల-2 లాంటి గొప్ప సినిమాని చింత పల్లి రామారావు తెలుగు ప్రేక్షకులను అందించడం ఆనందంగా ఉందని, ఈ చిత్రం ఆయనకు ఘనవిజయం అందిస్తుందని నిర్మాతలు సుబ్బారెడ్డి, తుమ్మల పల్లి రామసత్యనారాయణ, డీఎస్‌రావులు ఆకాంక్షించారు.

విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్,రాజీవ్ మీనన్, ఇలవరసు , బాలాజీ శక్తివేల్
తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, డి ఓ పి: వేల్ రాజ్, ఎడిటింగ్: ఆర్ : రామర్, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు,
నిర్మాతలు: ఎల్ రెడ్ కుమార్
చింతపల్లి రామారావు (తెలుగు వెర్షన్)

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago