విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ సినిమా వసూళ్లపై ఇతర మూవీస్ ఎఫెక్ట్ పడుతోంది. కింగ్డమ్ ముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ అయి స్ట్రాంగ్ ఓపెనింగ్స్ రాబట్టగా, ఆ తర్వాత వచ్చిన మహావతార్ నరసింహా కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. తీవ్రమైన పోటీ మధ్య రిలీజైన కింగ్డమ్ సినిమా విజయ్ స్టార్ పవర్ తో గురువారం, శుక్రవారం మంచి వసూళ్లు సాధించింది. యూఎస్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఫస్ట్ డే ఈ సినిమాకు 39 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కడం విశేషం. హరి హర వీరమల్లు, వార్ 2, కూలీ మూవీస్ నుంచి కింగ్డమ్ కు పోటీని కింగ్డమ్ మేకర్స్ ఊహించారు గానీ అనూహ్యంగా మహావతార్ నరసింహా మూవీ సూపర్ హిట్ కావడం 20 కోట్ల రూపాయలకు పైగాషేర్ కలెక్ట్ చేయడం ఊహించలేదు. కింగ్డమ్ కలెక్షన్స్ ను మహావతార్ నరసింహా డివైడ్ చేస్తోంది. గతంలో నాగవంశీ ప్రొడ్యూస్ చేసిన డాకూ మహారాజ్, గుంటూరు కారం, ఇప్పుడు కింగ్డమ్ మూవీస్ తీవ్రమైన బాక్సాఫీస్ పోటీలోనూ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టాయి. కింగ్డమ్ స్టైలిష్ హిట్ గా నిలిచి ఇంత కాంపిటేషన్ లోనూ అతి తక్కువ టైమ్ లో మేజర్ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. ముఖ్యం గా విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ కారణంగా తమిళ్, మలయాళం లో ఇప్పటికే ఈ సినిమా ప్రాఫిట్స్ లో కి రావడం విశేషం
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…