వేట్టైయాన్ – ది హంట‌ర్‌’ నుంచి ‘మనసిలాయో..’ లిరికల్ సాంగ్ రిలీజ్

మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. అంటూ ప‌క్కా మాస్ బీట్‌తో అమ్మాయి పాడే పాట వింటుంటే అంద‌రూ స్టెప్పులేయాల‌నిపిస్తోంది. ఇంత‌కీ అంత‌లా అంద‌రినీ మ‌డ‌త పెట్టేలా వ‌చ్చిందెవ‌రో తెలుసుకోవాలంటే ‘వేట్టైయాన్ – ది హంట‌ర్‌’ సినిమా చూసేయాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బ‌డ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్ – ది హంట‌ర్’.

‘వేట్టైయాన్ – ది హంట‌ర్‌’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 10న భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నారు. టి.జె.జ్ఞాన‌వేల్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు 2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్ వంటి చిత్రాల త‌ర్వాత ర‌జినీకాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్ష్ క‌ల‌యిక‌లో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’.

పేట‌, ద‌ర్బార్‌, జైల‌ర్ చిత్రాల‌కు పుట్ స్టాపింగ్ ట్యూన్ అందించి మెప్పించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ ర‌విచంద‌ర్ నాలుగోసారి ర‌జినీకాంత్ వేట్టైయాన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ‘మనసిలాయో..’ అంటూ సాగే ఈ పాట వింటుంటే ఎన‌ర్జిటిక్ బీట్‌తో సాగుతుంది. ర‌జినీకాంత్, మంజు వారియ‌ర్ మ‌ధ్య వ‌చ్చే పాట అని తెలుస్తుంది. అలాగే ఇందులో మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ సైతం స్టెప్పులేస్తూ క‌నిపించ‌టం విశేషం. సూప‌ర్ స్టార్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు ఆయ‌న అభిమానులు స‌హా అంద‌రినీ దృష్టిలో పెట్టుకుని అనిరుధ్ మ‌రోసారి త‌న‌దైన పంథాలో బాణీల‌ను అందించిన‌ట్లు ‘మనసిలాయో..’ అనే పాట‌ను వింటుంటే తెలుస్తోదిసినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శ్రీనివాస మౌళి రాసిన ఈ పాట‌ను న‌క‌ష్ అజీజ్‌, అరుణ్ కౌండిన్య‌, దీప్తి సురేష్ పాడారు. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌య‌మేమంటే ఈ పాట త‌మిళ వెర్ష‌న్ కోసం లెజెండ్రీ ప్లే బ్యాక్ సింగ్ మ‌లేషియా వాసుదేవ‌న్ వాయిస్‌ను ఏఐలోక్రియేట్ చేసి ఇందులో ఉప‌యోగించటం విశేషం.

ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆడియెన్స్‌కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో రిలీజ్ కానుంది.

తెలుగు రిలీజ్ హ‌క్కుల‌ను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా పాట‌లు విడుద‌ల‌వుతున్నాయి.

న‌టీన‌టులు:

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్‌, రానా ద‌గ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషరా విజ‌య‌న్ త‌దిత‌రులు

న‌టీన‌టులు:
బ్యాన‌ర్‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, సుభాస్క‌ర‌న్‌, టి.జె.జ్ఞాన‌వేల్‌, మ్యూజిక్‌: అనిరుద్ ర‌విచంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌.ఆర్‌.క‌దిర్‌, ఎడిట‌ర్‌: ఫిలోమిన్ రాజ్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కె.క‌దిర్‌, యాక్ష‌న్‌: అన్బ‌రివు, కొరియోగ్ర‌ఫీ: దినేష్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌: జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, పి.ఆర్‌.ఒ: నాయుడు సురేంద్ర కుమార్‌- ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

3 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago