వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు,శిరీష్, పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి #VenkyAnil03 ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ఈ మూవీ పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తయింది. 30+ రోజుల లెన్తీ షెడ్యూల్‌లో, మేకర్స్ లీడ్ యాక్టర్స్ పై, పాటలు, యాక్షన్ పార్ట్‌తో కూడిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ సందర్భంగా, సెట్‌లోని ఛీర్ ఫుల్ ఎట్మాస్ఫీయర్ చూపించే గ్లింప్స్ ద్వారా అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేసారు. “a day without laughter is a day wasted.”” అనే చార్లీ చాప్లిన్ కోట్ సూచిస్తూ చుట్టూ చిరునవ్వులతో, నటీనటుల మధ్య ఆనందాన్ని , స్నేహాన్ని వీడియో ప్రజెంట్ చేసింది.

మేకింగ్ వీడియోలో, వెంకటేష్ సంప్రదాయ దుస్తులలో కళ్లద్దాలతో కనిపిస్తుండగా, ఐశ్వర్య రాజేష్, అతని భార్య భాగ్య పాత్రలో, క్లాసిక్ చీరను ధరించింది. మీనాక్షి చౌదరి,ఎక్స్ లవ్ మీనాక్షి పాత్రలో మోడరన్ అవాతర్ లో కనిపించింది.

మున్నార్ దగ్గర ఇంటర్వెల్ సీక్వెన్స్ చిత్రీకరించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ వీడియో అనేక ఆనందమైన క్షణాలను కలిగి ఉంది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కానుందని టీం చెప్పడంతో వీడియో ఎండ్ అవుతుంది  

దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా కి  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.  సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ కో -రైటర్స్. వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్.

నటీనటులు: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కాబ్రా, చిట్టి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
కో- రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్
VFX: నరేంద్ర లోగిసా
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago