‘ఉత్సవం’ మనందరం గర్వపడే సినిమా. హీరో దిలీప్ ప్రకాష్

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ , నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షుకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరో దిలీప్ ప్రకాష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

ఉత్సవం ఎలా బిగైన్ అయ్యింది ? మీ జర్నీ గురించి చెప్పండి ?
-స్కూల్స్ డేస్ నుంచే సినిమాల పట్ల ఆసక్తి వుండేది. చిన్నప్పుడు స్కూల్ లో నాటకాలు రాయడం, ప్రదర్శించడం జరిగేది. ఎంబీఏ పూర్తి చేశాను. మధ్యలో ఓ సినిమాలో చిన్న రోల్ చేసే ఆఫర్ వచ్చింది. తర్వాత క్రేజీ బాయ్ అనే కన్నడ సినిమా చేశాను. ఆ సినిమా సక్సెస్ మీట్ లోనే డైరెక్టర్ అర్జున్ సాయి ని కలిశాను. ఆరేళ్ళ జర్నీలో ఆయన ఉత్సవం కథ చెప్పారు. ఇది చాలా రెస్పెక్టబుల్ సబ్జెక్ట్ చాలా గర్వంగా చెప్పుకునే సినిమా.

ఉత్సవం లో మీకు ఆకట్టుకున్న అంశాలు ఏమిటి ?
-చాలా అద్భుతమైన కథ. ఇందులో కథనే హీరో. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం గారు ఇలా చాలా మంది అద్భుతమైన యాక్టర్స్ వున్నారు. ఇది వండర్ ఫుల్ జర్నీ. వారందరినుంచి చాలా నేర్చుకున్నాను.

రెజీనా గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-రెజీనా స్వీట్ కో యాక్టర్. చాలా హెల్ప్ చేశారు. తననుంచి చాలా నేర్చుకున్నాను. చాలా కంఫర్ట్ బుల్ గా యాక్ట్ చేశాను.

ఉత్సవం ఎలా వుండబోతోంది ?
-రంగస్థల కళాకారుల మీద తీసిన సినిమా ఇది. సురభి నాటక సమాజం స్ఫూర్తి వుంది. సినిమా వచ్చిందే నాటకాల నుంచి. మన రూట్స్ ని గుర్తు చేసేలా వుంటుంది. ఇందులో మంచి ఫ్యామిలీ డ్రామా, రోమాన్స్ కూడా వుంటుంది. అనూప్ రూబెన్స్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆడియన్స్ ని అలరించే అన్ని ఎలిమెంట్స్ ప్యాకేజ్ లా వుంటుంది. చాలా గొప్పనటులు ఇందులో వున్నారు. సినిమా చూసిన కొందరు ” ఫీల్ గుడ్ సినిమా, లైట్ హార్ట్ సినిమా’ అని ప్రశంసించారు.

ప్రకాష్ రాజ్ గారి లాంటి సీనియర్ యాక్టర్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-ప్రకాష్ రాజ్ గారు లాంటి వెర్సటైల్ యాక్టర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం వెరీ ఛాలెంజ్. ఈ ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేశాను. ప్రకాష్ రాజ్ గారు నా నటన చూసి ‘గుడ్ జాబ్’అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తోంది ?
-మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారు ఈ సినిమా చూశారు. ఆయనకి కంటెంట్ చాలా నచ్చింది. అలా హోంబలే వారు కర్ణాటక లో రిలీజ్ చేస్తున్నారు. నార్త్ లో సినీ పోలీస్ రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రముఖ సంస్థలు సినిమాని విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాం.

ఈ సినిమాలో సందేశం వుంటుందా?
-ఇందులో హీరోది నాటకాలకి మళ్ళీ తీసుకొచ్చే క్యారెక్టర్. అయితే ఇదంతా సందేశం చెప్పేలా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ విధానంలోనే చూపించాం. ఇందులో తెలుగు కల్చర్, ట్రెడిషన్ చాలా అద్భుతంగా చూపించాం.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ గురించి ?
-నా మొదటి సినిమాలోనే ఇంత అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. ఈ విషయంలో అనూప్ కి థాంక్స్ చెబుతున్నాను.

-అనంత్ శ్రీరామ్, భాస్కర భట్ల, వనమాలి వండర్ ఫుల్ లిరిక్స్ రాశారు.

-ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి గారు ప్రతి డిటెయిల్ తీసుకొని చాలా అద్భుతంగా ఆర్ట్ వర్క్ చేశారు. కథ కోసం అందరూ సినిమాని వోన్ చేసుకొని పని చేశారు.

నిర్మాత సురేష్‌ పాటిల్‌ గురించి ?
-ఆయనకి స్పెషల్ గా థాంక్స్ చెబుతున్నా. ఆయన వలనే ఈ సినిమా పాజిబుల్ అయ్యింది.

మీరు తెలుగు బాగా మాట్లాడుతన్నారు కదా ?
-నాన్న సైడ్ తెలుగు. హిందూపూర్. అమ్మ సైడ్ కన్నడ. జై బాలయ్య( నవ్వుతూ)

మీ ఫేవరేట్ జోనర్ ఏంటి ?
-నాకు యాక్షన్ సినిమాలు ఇష్టం. నేను చేయబోయే నెక్స్ట్ సినిమా యాక్షన్ జోనర్ లో వుంటుంది.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago