డబుల్ ఇస్మార్ట్ యాక్షన్-ప్యాక్డ్ ఫస్ట్ షెడ్యూల్‌ పూర్తి.

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ -క్రేజీ ఇండియన్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ యాక్షన్-ప్యాక్డ్ ఫస్ట్ షెడ్యూల్‌ పూర్తి.

ఉస్తాద్ రామ్ పోతినేని మరియు సంచలన దర్శకుడు పూరీ జగన్నాధ్ యొక్క క్రేజీ ఇండియన్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ యాక్షన్-ప్యాక్డ్ ఫస్ట్ షెడ్యూల్‌ షూటింగ్ ను ముంబైలో విజయవంతంగా పూర్తి చేసుకుంది. టీమ్ త్వరలో మరో క్రేజీ షూట్‌ ను ప్రారంభించనుంది. రామ్‌ తో పాటు పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా తొలి షెడ్యూల్‌ లో పాల్గొన్నారు. ఇటీవల అతని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన బిగ్ బుల్ ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది .

“మా ఫస్ట్ యాక్షన్-ప్యాక్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది మరియు ఇప్పుడు మరో క్రేజీ షూటింగ్ కోసం భారతదేశం నుండి బయలుదేరడానికి సమయం ఆసన్నమైంది.
#డబుల్‌ఇస్మార్ట్ థియేటర్స్ లో మార్చి 8, 2024

” అని నిర్మాత ఛార్మీ ట్వీట్ చేసారు, రామ్‌ తో పాటు ఆమె సెల్ఫీని కూడా షేర్ చేశాడు.

రామ్, పూరీల డెడ్లీ కాంబినేషన్‌ లో బ్లాక్‌బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్‌ కి సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌ పై పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. విషు రెడ్డి సీఈవో.

పూరి జగన్నాధ్ పెద్ద స్పాన్ ఉన్న కథను రాశారు మరియు అతను ప్రధాన నటీనటులను పూర్తిగా స్టైలిష్ గా చూపించనున్నారు. డబుల్ ఇస్మార్ట్ లో రామ్ స్టైలిష్ బెస్ట్ లుక్ లో కనిపిస్తున్నారు.

ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని గియాన్నెల్లి పనిచేస్తున్నారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో అధిక బడ్జెట్‌ తో డబుల్‌ ఇస్మార్ట్‌ రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు మేకర్స్.

డబుల్ ఇస్మార్ట్ మార్చి 8, 2024న మహా శివరాత్రికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.

తారాగణం: రామ్ పోతినేని, సంజయ్ దత్

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
DOP: జియాని గియాన్నెల్లి
స్టంట్ డైరెక్టర్: కేచ
PRO: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

7 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago