టాలీవుడ్

ఘనంగా ‘త్రికాల’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా త్రికాల సినిమాను మణి తెల్లగూటి తెరకెక్కిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

‘యుద్దం రేపటి వెలుగు కోసం.. కానీ ఈ అంధకాసురిడి యుద్దం వెలుగుని నాశనం చేయడానికి’.. అంటూ తనికెళ్ల భరణి డైలాగ్స్‌తో మొదలైన ట్రైలర్.. యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్నీ కూడా హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ‘ఒక సైక్రియార్టిస్ట్‌గా ఛాలెంజింగ్ కేసుని చూస్తున్నా’ అంటూ శ్రద్దా దాస్ పాత్రను ఈ ట్రైలర్‌లో పరిచయం చేశారు. మాస్టర్ మహేంద్రన్ చేసే యాక్షన్ సీక్వెన్స్, ట్రైలర్ చివర్లో అజయ్ విశ్వరూపం, డైలాగ్స్ అదిరిపోయాయి.

త్రికాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌ను చిత్రయూనిట్ శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో

అజయ్ మాట్లాడుతూ.. ‘మణి గారు నాకు రెండు, మూడేళ్ల క్రితం త్రికాల కథ చెప్పారు. బడ్జెట్ ఎక్కువ అయ్యేట్టుంది ఎలా చేస్తారో అనుకున్నా. ఇంత వరకు నాకు ఏం చూపించలేదు. నేరుగా ఇక్కడే ట్రైలర్‌ను చూశాను. అద్భుతంగా వచ్చింది. మణి, శ్రీనివాస్ గారు ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. అందరూ ది బెస్ట్ ఇచ్చారు. మహేంద్రన్ అందరి కంటే చాలా సీనియర్. మంచి చిత్రాన్ని తీశాం. క్వాలిటీ అద్భుతంగా ఉంది. ఈ సినిమాను అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

అంబటి అర్జున్ మాట్లాడుతూ.. ‘త్రికాల ట్రైలర్ చూశాక అందరికీ ఈ మూవీ ఏంటో అర్థం అవుతుంది. మణి గారి నమ్మకం మీద ఈ మూవీ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. ‘త్రికాల సినిమా కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ఈ మూవీ కోసం చాలా రీ షూట్ జరిగింది. కానీ ఎప్పుడూ కూడా వారు ప్రశ్నించలేదు. మణి ఈ మూవీని అద్భుతంగా తీశాడు. చాలా టాలెంట్ ఉన్న పర్సన్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మణికి థాంక్స్. పని విషయంలో కెమెరామెన్ చాలా వయలెంట్. అజయ్ గారు చాలా మంచి యాక్టర్. ఆయన్నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. రవి వర్మ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. సాహితి చాలా మంచి వ్యక్తి. శ్రద్దా దాస్ గారు ప్రతీ విషయాన్ని ఎంతో నిశితంగా పరిశీలిస్తారు. మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సమ్మర్‌లో మా సినిమా రాబోతోంది. అందరూ మా చిత్రాన్ని సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

రవి వర్మ మాట్లాడుతూ.. ‘త్రికాల ట్రైలర్ చాలా బాగుంది. చిన్న పాత్రగా మొదలైనా.. సినిమా అంతా నన్ను వాడేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా చివరి వరకు నిలబడి దర్శక, నిర్మాతలు సినిమాను నిలబెట్టారు. ఈ చిత్రానికి అందరి సపోర్ట్ ఉండాలి’ అని అన్నారు.

సాహితి మాట్లాడుతూ.. ‘త్రికాలలో నటించడం ఆనందంగా ఉంది. ఈ మూవీ ట్రైలర్ అద్భుతంగా వచ్చింది. సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. అన్ని వర్గాల ఆడియెన్స్‌ను అలరించేలా చిత్రం ఉంటుంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. థియేటర్లో మా సినిమాను చూసి ఆదరించండి’ అని అన్నారు.

దర్శకుడు మణి మాట్లాడుతూ.. ‘అజయ్ గారికే ఈ కథను ముందుగా చెప్పాను. వీఎఫ్ఎక్స్ గురించి జాగ్రత్తగా చూసుకో అని ఆయన సలహా ఇచ్చారు. త్రికాల సినిమాటిక్ యూనివర్స్ అని ట్రైలర్‌లో పెట్టాం. అంబటి అర్జున్ ఒక్క రోజే షూటింగ్ చేశారు. అదేంటో ఫ్యూచర్‌లో తెలుస్తుంది. ఈ మూవీకి నాతో పాటు అన్ని రోజులు పని చేశాడు మహేంద్రన్. సాహితి పాత్రను ఎక్కువగా రివీల్ చేయకూడదని అనుకున్నా. రూప కారెక్టర్ సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. సెట్‌లో రవి వర్మ గారు ఎప్పుడూ ఇది జరుగుతుందా? అని కంగారు పడుతుండేవారు. సాయిదీప్, వెంకట రమేష్ సెట్‌లో చాలా కష్టపడ్డారు. షాజిత్, హర్ష వర్దన్ రామేశ్వర్ సంగీతం అద్భుతంగా ఉంటుంది. మా నిర్మాతలు రాధిక, శ్రీనివాస్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. మేం ఈ మూవీ కోసం చాలా వదులుకున్నాం. నా రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్ చేసింది. అజయ్ గారు మాకు ఈ ప్రయాణంలో అండగా నిలబడ్డారు. మా చిత్రం సమ్మర్‌లో రాబోతోంది. అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

నిర్మాత రాధిక మాట్లాడుతూ.. ‘త్రికాల ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు వచ్చినవారందరికీ థాంక్స్. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని, మన సూపర్ హీరోల్ని అందరికీ చూపించాలని త్రికాల సినిమాను తీశాం. బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్‌లా మన త్రికాల ఉంటుంది. టైంతో సంబంధం లేకుండా కాపాడేవాడే త్రికాల. ఇంకా త్రికాల గురించి తెలియాలంటే సినిమాను చూడాల్సిందే. మాకు మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘త్రికాల మూవీకి సీజీ వర్క్ ఎక్కువగా అవసరం పడింది. అందుకే ఈ మూవీ లేట్ అవుతూ వచ్చింది. మన పురాణాల్లోనే హనుమాన్, భీమ్ వంటి సూపర్ హీరోలున్నారు. మనం ఓ ఫిక్షనల్ హీరోని సృష్టించాలని అనుకున్నాం. అలా పుట్టిందే ఈ త్రికాల. సమ్మర్‌లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నామ’ని అన్నారు.

సహ నిర్మాత సాయిదీప్ మాట్లాడుతూ.. ‘త్రికాల ఒక గొప్ప చిత్రం కాబోతోంది. ఇది మేం ఎంతో కష్టపడి చేశాం. మా ఆర్టిసుల సహకారం మరవలేనిది. ప్రాస మణి, మహేంద్రన్ అద్భుతంగా నటించారు. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ మూవీని తీశాం. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పూర్తితోనే ముందుకు వెళ్తున్నామ’ని అన్నారు.

సహ నిర్మాత వెంకట్ రమేష్ మాట్లాడుతూ.. ‘త్రికాల కోసం అందరూ ఎంతో అంకిత భావంతో పని చేశారు. ప్రాణం పెట్టి అందరూ పని చేశారు. మా చిత్రానికి మీడియా, ఆడియెన్స్ నుంచి సహకారం లభించాలి’ అని అన్నారు.

కెమెరామెన్ పవన్ మాట్లాడుతూ.. ‘త్రికాల సినిమా జర్నీలో నాకు మణి గారు ఎంతో అండగా నిలబడ్డారు. సినిమా అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ షాజిత్ మాట్లాడుతూ.. ‘నాది కేరళ. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన మణి గారికి థాంక్స్. ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది. ఈ మూవీ ఏంటో రిలీజ్ అయ్యాక అందరికీ తెలుస్తుంది’ అని అన్నారు.

లిరిసిస్ట్ రాకెందు మౌళి మాట్లాడుతూ.. ‘మణి నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. త్రికాలను అద్భుతంగా తీశాడు. ఇదొక ఫ్యాంటసీ థ్రిల్లర్. ఇదొక అద్భుతమైన చిత్రం కానుంది. థియేటర్లో ఈ మూవీని చూస్తేనే కిక్కు వస్తుంది. నేను ఇందులో మంచి పాటలు రాశాను. అందరూ సినిమాను థియేటర్లోనే చూడండి’ అని అన్నారు.

త్రికాల సినిమాకు కెమెరామెన్ పవన్ చెన్నా అద్భుతమైన విజువల్స్ అందించాడు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ త్రికాలను చూపించాడు. ఇక షాజిత్ హుమాయున్, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ అదిరిపోయింది. వీఎఫ్ఎక్స్ అయితే నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. ఈ ట్రైలర్‌తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. సమ్మర్ స్పెషల్‌గా ఈ మూవీని ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు : శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి

సాంకేతిక సిబ్బంది
నిర్మాత : రాధిక, శ్రీనివాస్
సహ నిర్మాతలు : శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి
రైటర్, దర్శకుడు, ఎడిటర్ : మణి తెల్లగూటి
సంగీతం : షాజిత్ హుమాయున్, హర్షవర్దన్ రామేశ్వర్
కెమెరా : పవన్ చెన్నా
పీఆర్వో : సాయి సతీష్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

7 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago