తెలుగులో ట్రెండింగ్….కన్నడలో సూపర్ హిట్
“ఏమిటో మాయ మంత్రమేమది జింకలా పరిగెత్తేనే….”
యువ ప్రతిభాశాలి తేజ్ నటిస్తూ కన్నడ-తెలుగు భాషల్లో దర్శకత్వం వహిస్తున్న వినూత్న ద్విభాషా చిత్రం “డ్యూడ్”. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ఏమిటో మాయ మంత్రమే… మది జింకలా పరిగెత్తేనే” పాట అటు కన్నడలో.. ఇటు తెలుగులో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నది. తెలుగులో ఎస్.పి.మనోహర్ రాసిన ఈ గీతాన్ని అభిషేక్ ఆలపించారు. ఎమిల్ మహమ్మద్ ఈ చిత్రానికి సంగీత సారధి!!
రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయింది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ లేదా జులైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. “డ్యూడ్” నుంచి విడుదలైన తొలి గీతానికి అటు కన్నడలో… ఇటు తెలుగులో లభిస్తున్న అసాధారణ స్పందనకు చిత్ర కథానాయకుడు కమ్ దర్శకుడు తేజ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు!!
ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్… ఈ చిత్రానికి ‘స్క్రిప్ట్ కన్సల్టెంట్’గా కూడా వ్యవహరిస్తుడడం విశేషం. “శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష, రాజేశ్వరి” వివిధ రంగాలకు చెంది, ఫుట్ బాల్ అంటే పడి చచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
పనోరమిక్ స్టూడియోస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, “జింకే మారి” ఫేమ్ ఎమిల్ మహమ్మద్ సంగీతం సమకూర్చుతుండగా… “అలా మొదలైంది” ఫేమ్ ప్రేమ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నిర్మాణం: పనోరమిక్ స్టూడియోస్, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: తేజ్!!
వెర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ లీడ్ రోల్ లో ఒకరిగా ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల,…
గీత రచయితగా తన ప్రస్థానం చాలా సంతృప్తికరంగా సాగుతోందని అన్నారు ప్రముఖ లిరిసిస్ట్ కేకే(కృష్ణకాంత్). గతేడాది రాసిన పాటలన్నీ ఛాట్…
Famous lyricist KK (Krishnakanth) shared that his journey as a lyricist has been progressing very…
ప్రేక్షకులు ప్రస్తుతం రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో…
Versatile actor Aditya Om’s upcoming film Bandi which is inspired by the urgent and timely…
సాయి కుమార్ అంటే అందరికీ నాలుగు సింహాల డైలాగ్ గుర్తుకు వస్తుంది. పోలీస్ స్టోరీ సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీలో…