ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా ‘మా ఇంటి బంగారం’ను సగర్వంగా ప్రారంభించినట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది బ్యానర్ నుంచి వచ్చిన ‘శుభం’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ‘మా ఇంటి బంగారం’ సినిమాలో సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మాతలు. ఓ బేబి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ చిత్రానికి ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా… సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సీతా మీనన్. వసంత్ మరిన్‌గంటి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. పల్లవి సింగ్ కాస్ట్యూమర్, ఉల్లాస్ హైదర్ ప్రొడక్షన్ డిజైనర్, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా వర్క్‌చేస్తున్నారు.
సన్నిహితులు, శ్రేయోభిలాషుల ఆత్మీయ కలయిక, ఆశీర్వాదాలతో సినిమా ప్రారంభమైంది. మూవీ ఫస్ట్ లుక్‌ను గమనిస్తే గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామాగా అనిపించింది. అద్భుతమైన యాక్షన్ బ్యాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. సినిమా షూటింగ్ ప్రారంభమైందని, మరిన్ని వివరాలను తెలిజేస్తామని మేకర్స్ పేర్కొన్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…