హీరో సుహాస్‌ ‘ ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్‌ విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్‌ రిలీజ్‌ కానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్‌. ట్రైలర్‌ను గమనిస్తే.. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌, హీరో, హీరోయిన్స్‌ ఎనర్జీ, ఇలా ఈతరం ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారిని అలరించే ఫుల్‌ ప్యాకేజీగా ఈ చిత్రాన్ని రూపొందించారని అర్థమవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ” ట్రైలర్‌ విడుదలైన కొద్ది సమయంలోనే మంచి స్పందన వస్తోంది. ట్రైలర్‌ చూసిన వారు ఈచిత్రం షూర్‌ షాట్‌ విజయం అంటుంటే ఆనందంగా ఉంది.క్యూట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రత సన్నివేశం ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుంది. హీరో సుహాస్‌, మాళవిక మధ్య వచ్చే లవ్‌ సీన్స్‌ కూడా అలరించే విధంగా ఉంటాయి. సుహాస్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం అందరికి కొత్త అనుభూతినిస్తుంది. జూలై 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా రాబోతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మీ హృదయాలను దోచుకుంటుంది. తప్పకుండా నిర్మాతగా ఓ మంచి సినిమాను ఇవ్వబోతున్నాం అనే నమ్మకం ఉంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ప్రతి ప్రమోషన్‌ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఓ క్వాలిటీ సినిమాను ప్రేక్షకులకు ఇవ్వడానికి ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మాత హరీష్‌ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించాడు. ప్రొడక్ట్‌ క్వాలిటీగా రావడానికి ఆయనే కారణం. మణికందన్‌ ఫోటోగ్రఫీతో ఈ సినిమాను చాలా కలర్‌ఫుల్‌గా మలిచాడు.రథన్‌ ఈ లవ్‌స్టోరీకి చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో ఉన్న ఆరుపాటలు వేటికవే అనే విధంగా బ్యూటిఫుల్‌గా ఉంటాయి అన్నారు.
ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. మణికందన్‌ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి రథన్‌ సంగీతాన్నిసమాకూరుస్తున్నాడు. బ్రహ్మా కడలి ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago