నమస్తే సేట్ జీ సినిమా విజయం ప్రతి ఒక్క కిరాణా షాపు వ్యక్తి దే- తనికెళ్ళ భరణి

Must Read

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై, తల్లాడ శ్రీనివాస్ నిర్మాత గా , తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి అమ్మినేని హీరోయిన్ గా చేసిన సినిమా “నమస్తే సేట్ జీ”.

కిరాణా షాపుల జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ, లాక్ డౌన్ లో వారు చేసిన సేవలు గుర్తిస్తూ తీసిన సినిమా “నమస్తే సేట్ జీ”.
తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండో వారంలోకి ఎంటర్ ఐనా సందర్భంగా టీం అందరిని ప్రముఖ నటుడు ,దర్శకుడు తనికెళ్ళ భరణి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ  సాయికృష్ణ కి, స్వప్న కి శుభాకాంక్షలు, అసలు సినిమా తీయడం ఒక ఎత్తు,థియేటర్లో విడుదల చేయడం మరొక ఎత్తు అలాంటిది చిన్న సినిమా లాగా విడుదలై ఈ రోజు థియేటర్లు పెరుగుతూ ,ఎంతోమంది ప్రేక్షకుల మనసులు దోచుకున్న పెద్ద సినిమా అవ్వడం మాములు విషయం కాదు, ఇది అంత కేవలం టీం వర్క్ లా సినిమా తీయడం వలనే సాధ్యం అవుతుంది. అలానే మా సాయికృష్ణ త్వరలో సినిమా పరిశ్రమ స్థాయిని పెంచే స్థాయి లో ఉంటాడు.టీం అందరికి శుభాకాంక్షలు, అలానే హీరోయిన్ గా చేసిన స్వప్న చౌదరి కి మంచి భవిష్యత్తు ఉంది అని అన్నారు.

డైరెక్టర్ & హీరో తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ ఈ విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్క కిరాణా షాపు వ్యక్తులకు, ఆర్యవైశ్య సంఘాల వారికి, సామాన్య ప్రేక్షకులకు, అలానే మా డిస్ట్రిబ్యూటర్ బాబు గారికి, గణేష్ గారికి, శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.అలానే మా విజయం తెలుసుకొని మమ్మల్ని పిలిసి అశీస్సులు తెలిపిన మా గురువు గారు తనికెళ్ళ భరణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే మా హీరోయిన్ స్వప్న చౌదరి, నటుడు శోభన్ భోగరాజు, చింతల శ్రీనివాస్, లకి అభినందనలు.

హీరోయిన్ స్వప్న చౌదరి మాట్లాడుతూ సిల్వర్ స్క్రీన్ మీద కనపడాలి అనేది చిన్నప్పటి నుండి నా కల , మా అమ్మ కోరిక, అలాంటి ఒక్క రోజు ఒక్క షో ఐనా రన్ ఐనా చాలు అనుకున్న మా నమస్తే సేట్ జీ సినిమా వరుసగా రెండో వారంలోకి కూడా ఎంటర్ ఐనది.ఇక పోతే సినిమా చూసిన ప్రతి చోట ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది, ప్రతి థియేటర్ కి వెళ్లి ప్రేక్షకుల స్పందన తెలుసుకుంటున్నాం. అలానే మమ్మల్ని తనికెళ్ళ భరణి గారు పిలిసి శుభాకాంక్షలు తెలపడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
ఈ క్రిస్మస్ పండుగ కి మా సినిమా విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News