ప్రతిభావంతులను ప్రోత్సహించి, వారి ప్రతిభను మా సంస్థ కోసం ఉపయోగించుకోవటమే యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం

చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే యువ ప్రతిభావంతులను ప్రోత్సహించడమే తమ ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యమని అన్నారు ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ వివరాలను ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ వివరించారు. ఈ కార్యక్రమంలో పోటీకి ఎంపికైన షార్ట్ ఫిలింస్ మేకర్స్, ఆర్జీవీ డెన్ ప్రొడ్యూసర్ రవి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఈ కాంటెస్ట్ కు ఎంట్రీలు రావడం విశేషం. ఈ కార్యక్రమంలో

దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – మొదటి సినిమా శివ సమయంలో నా గురించి ఎవరికీ తెలియదు. శివ సినిమా ప్రేక్షకాదరణ పొందింది కాబట్టి రామ్ గోపాల్ వర్మ అంటే ఎవరో అందరికీ తెలిసింది. కానీ ప్రతిభ ఉండి నాలా ఇంకా ప్రపంచానికి తెలియాల్సిన వారు ఎంతోమంది ఉన్నారు. మా నాన్న అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజినీర్ కాబట్టి నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు వీలు దొరికింది. వచ్చాక నేను ఏం చేశాను అనేది తర్వాత విషయం. ముందు మన కాన్సెప్ట్ చెప్పేందుకు ఎవరో ఒకరు అవకాశం ఇవ్వాలి కదా. వివిధ ప్రాంతాల్లో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తమలో ఎంతో ప్రతిభ ఉండి కూడా అవకాశాలు పొందలేకపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు.

అలాంటి వారికి ఇండస్ట్రీతో ఒక యాక్సెస్ ఇచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కాంటెస్ట్ ఆర్జీవీ యువర్ ఫిల్మ్. ఈ కాంటెస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత దాదాపు 400 ఎంట్రీలు వచ్చాయి. ఇవి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఉన్నాయి. వీటిలో 11 షార్ట్ ఫిలింస్ షార్ట్ లిస్ట్ చేసి ఎంపికచేశాం. నార్త్ ఇండియా నుంచి కూడా వచ్చాయి గానీ అవి షార్ట్ లిస్ట్ కాలేదు. షార్ట్ లిస్ట్ అయిన వాటిని సోషల్ మీడియాలో పోల్ కు పెట్టి ప్రేక్షకులు ఎక్కువమంది బెస్ట్ డైరెక్టర్ గా ఓటు వేసిన వారికి మా సంస్థలో అవకాశం ఇస్తాం. పేర్లు చెప్పను గానీ ఇప్పటికే వీరిలో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేశాను. వారికి సినిమా అవకాశం ఇవ్వబోతున్నాం. ఒక్క డైరెక్టర్స్ అనే కాదు. డీవోపీ, మ్యూజిక్ డైరెక్షన్ ఇలా..ప్రతి క్రాఫ్టులో టాలెంటెడ్ వారిని సెలెక్ట్ చేస్తున్నాం. ఈ పోల్ కు రెండు వారాల టైమ్ తీసుకుంటాం. ఈ షార్ట్ ఫిలింస్ చేసిన వారు నాకంటే బాగా డైరెక్ట్ చేశారు. ఈ షార్ట్ ఫిలింస్ లో మీరు ప్రొడక్షన్ వ్యాల్యూస్ చూడొద్దు. కాన్సెప్ట్ ను ఎంతబాగా కన్వే చేశారనేది మాత్రం చూడమని కోరుతున్నా. ఎందుకంటే మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాలు చూసిన మీకు వీరు అతి తక్కువ రిసోర్సెస్, బడ్జెట్ లో చేసిన మూవీస్ నచ్చకపోవచ్చు. కానీ వారి కాన్సెప్ట్ మేకింగ్ ఆకట్టుకుంటే చాలు.

ఈ కాంటెస్ట్ లో సెలెక్ట్ అయిన వారి ప్రతిభను ముందుగా మా సంస్థలో ఉపయోగించుకోవాలనేది నాది, ప్రొడ్యూసర్ రవి గారి స్వార్థం. అంతేగానీ వీళ్లందరికీ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలనేది ఒక్కటే ఆలోచన కాదు. ఆ తర్వాత వాళ్లు మమ్మల్ని వదిలేసి వెళ్తారనే విషయం కూడా తెలుసు. ఎవరికైనా మొదటి అవకాశం దొరకడం ముఖ్యం ఆ తర్వాత వాళ్లను వాళ్లు ప్రూవ్ చేసుకుని కెరీర్ లో ముందుకెళ్లాల్సిఉంటుంది. అన్నారు

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago