ఆసక్తికర సన్నివేశాలతో పరమపద సోపానం టీజర్ విడుదల

మాఫియా అక్రమాల నేపథ్యంలో SS మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న కొత్త సినిమా పరమపద సోపానం. గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ అంబటి హీరోగా నటిస్తుండగా ఆయన సరసన జెన్నిఫర్ హీరోయిన్ గా నటిస్తోంది. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుతున్న యూనిట్.. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.

ఆయువు కోసం అరువులు చాస్తూ నోరు తెరిచిన కాల సర్పం కంట పడకుండా.. ఎగిరిపోవాలి అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో ఆసక్తికర ఎలిమెంట్స్ చూపించారు. సినిమా సోల్ తెలిసేలా యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసి కథపై క్యూరియాసిటీ పెంచారు. టీజర్ లో వినిపించిన ఒకటి రెండు డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మాఫియా ప్రధానంగా ఈ మూవీ రూపొందుతోందని స్పష్టం చేస్తూ వదిలిన ఈ టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందని చెప్పుకోవచ్చు.

ఈ చిత్రంలో అజయ్ రత్నం, పిల్లా ప్రసాద్, జ్యోతి, అనంత్, చింటూ, భాషా, సంతోష్, నమ్రిత – ఐటెం సాంగ్ డాన్సర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. రాంబాబు గోశాల లిరిక్స్ రాశారు. గీతామాధురి
పృద్వి చంద్ర, హరిప్రియ, అదితి భావరాజు, యశస్వి కొండేపూడి సాంగ్స్ పాడారు. శివ శంకర్ మాస్టర్, యానీ మాస్టర్, సాయితేజ కొరియోగ్రఫీ అందించారు. దేవి శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేయగా.. సత్య మహావీర్ సంగీతం అందించారు.

ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నాగ శివ తీసుకోగా.. గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గౌతమ్ రాజ్ నెరుసు ఎడిటర్ గా, గణపర్తి నారాయణ రావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, గుడిమిట్ల ఈశ్వర్ కో – ప్రొడ్యూసర్ గా బాధ్యతలు చేపట్టారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్, ఇతర వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago