వెర్సటైల్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నవంబర్ 7న వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. ఈ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
మంచి కంటెంట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పగా ఆదరిస్తారని ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ మరోసారి ప్రూవ్ చేసింది. ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులు, మీడియా నుంచి సినిమాకు అమేజింగ్ అంటూ రెస్పాన్స్ రావటం విశేషం. లిమిటెడ్ బడ్జెట్‌లో.. లిమిటెడ్ స్క్రీన్స్‌లో రిలీజైన ఈ సినిమాకు తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. సినిమా చూసిన అందరూ సినిమాలో నటీనటులను, సాంకేతిక నిపుణులను.. సినిమా కథను తెరకెక్కించిన విధానాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమాకు వస్తోన్న హిట్ టాక్‌తో నేటి నుంచి మరికొన్ని స్క్రీన్స్ పెరగున్నాయి. తొలి మూడు రోజుల్లో సినిమా రూ.2.22 కోట్ల రూపాయలను వసూలు చేయటం విశేషం.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా ప్రేక్షకులను మెప్పించింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫ్యామిలీ ఫన్ రైడర్‌ను చూడలేదని ప్రేక్షకులు అభినందిస్తున్నారు. ఫోటోగ్రాఫర్ రమేష్ పాత్రలో తిరువీర్ అందరినీ నవ్వించారరు. ఓ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ వల్ల ఏర్పడిన గందరగోళంతో ఏర్పడే హాస్యం అందరినీ అలరించింది. సిట్యుయేషనల్ కామెడీ, మంచి ఎమోషన్స్‌ను మిళితం చేసి ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పిస్తోంది.
తారాగణం : తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ తదితరులు.
సాంకేతిక వర్గం :
రచన, దర్శకత్వం : రాహుల్ శ్రీనివాస్
నిర్మాతలు : సందీప్ అగరం & అశ్మితా రెడ్డి బసాని
సహ నిర్మాత : కల్పనారావు
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ : కె.సోమ శేఖర్
ఎడిటర్ : నరేష్ అడుప
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రజ్ఞయ్ కొణిగారి
ప్రొడక్షన్ డిజైనర్ : ఫణి తేజ మూసి
కాస్ట్యూమ్ డిజైనర్లు : ఆర్తి విన్నకోట, ప్రియాంక వీరబోయిన
సాహిత్యం : సనారే
సౌండ్ డిజైనర్: అశ్విన్ రాజశేఖర్
పి.ఆర్.ఒ : నాయుడు – ఫణి (బియాండ్ మీడియా)
పబ్లిసిటీ డిజైనర్: ఐడియల్ డాట్స్
మార్కెటింగ్: హౌస్‌ఫుల్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…