దిల్ రాజు చేతుల మీదుగా బ్లడ్ అండ్ చాక్లెట్ ఫస్ట్ లుక్ విడుదల

లెజండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్స్ అయిన ఎస్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్ మాల్ లాంటి చిత్రాలన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే పంథాలో డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్ లో మొదటి సారి సస్పెన్స్ థ్రిల్లర్ గా బ్లడ్ అండ్ చాక్లెట్ చిత్రాన్ని నిర్మించారు.

షాపింగ్ మాల్, ఏకవీర తదితర సెన్సిబుల్ చిత్రాలను రూపొందించి, జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న వసంతబాలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన అర్జున్ దాస్ హీరోగా, దుసరా విజయన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ ట్విట్టర్ వేదికగా దిల్ రాజు విడుదల చేశారు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో జూలై 21న విడుదలకానుంది. తెలుగులో ఎస్.ఆర్ డి.ఎస్ సంస్థ చిత్రాన్ని విడుదల చేయనుంది.. ప్రముఖ సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాష్ నాలుగు అద్భుతమైన పాటలు అందించారు.

ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని దర్శకుడు వసంతబాలన్ చెప్పారు. ఇంకా ఈ చిత్రంలో వనితా విజయ్ కుమార్, అర్జున్ చిదంబరం, సురేష్ చక్రవర్తి తదితరులు నటించారు.

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

4 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago