‘నింద’ చిత్రం చాలా కొత్తగా ఉండబోతోంది.. హీరో వరుణ్ సందేశ్

వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే చిత్రాన్ని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోంది.ఈ మూవీ విశేషాలను పంచుకునేందుకు హీరో వరుణ్ సందేశ్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన చెప్పిన సంగతులివే..

‘నింద’ కథను అంగీకరించడానికి ప్రధాన కారణం ఏంటి?
రొటీన్ సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్‌గా అనిపించింది. ఏంట్రా ఇలాంటి సినిమాలే చేస్తున్నానని అనుకునే సందర్భాలు వచ్చాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని యూఎస్ వెళ్లా. ఆ టైంలోనే రాజేష్ గారు ఈ నింద కథను చెప్పారు. విన్న వెంటనే ఎంతో నచ్చింది. ఈ సినిమా చేసేద్దామని అన్నాను.

‘నింద’లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
నిందలో నా పాత్రకి, నిజ జీవితంలోని నా పాత్రకి అస్సలు పోలిక ఉండదు. నేను బయట జాలీగా, చిల్‌గా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా సీరియస్‌గా ఉండను. కానీ ఈ చిత్రంలో నా వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి పూర్తిగా భిన్నమైన పాత్రను పోషించాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా కనిపిస్తాను.

ఈ మూవీ దర్శకుడే నిర్మాతగా అవుతారని మీకు ముందే తెలుసా?
నింద కథ విన్నప్పుడు ఈ మూవీని ఎవరు నిర్మిస్తారు.. ఎవరు తీస్తారు అనే ఆలోచనలు రాలేదు. నాకు కథ నచ్చింది. రాజేష్ కథను నెరేట్ చేసిన విధానం మరింతగా నచ్చింది. ఇక ఆయనే సినిమాను నిర్మిస్తున్నాడని తెలిసి మరింత ఆనందం వేసింది. తన కథ మీద తనకు ఉన్న నమ్మకంతోనే నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఆయనకు చాలా గట్స్, ధైర్యం ఉండటం వల్లే దర్శకుడిగా, నిర్మాతగా ఈ సినిమాను చేశారు.

‘నింద’ సినిమాలో కొత్తగా ఏం చెప్పబోతున్నారు? ఎలా ఉండబోతోంది?
సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లలో ఎన్నో సినిమాలు వచ్చాయి. నింద విషయంలో మాత్రం స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉండబోతోంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఊహించలేరు. అసలు పూర్తి కథను, స్క్రిప్ట్‌ని ఆర్టిస్టులెవ్వరికీ నెరేట్ చేయలేదు. దీంతో నటించే ఆర్టిస్టుల్లోనూ ఓ క్యూరియాసిటీ పెరిగింది. అసలు నేరస్థుడు ఎవరు? అనే విషయం తెలియకపోవడంతో సహజంగా నటించారు. కథ చెప్పినప్పుడు నేను గెస్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ నేను కూడా చెప్పలేకపోయాను.

‘నింద’ టెక్నికల్‌గా ఎలా ఉండబోతోంది?
‘నింద’ లాంటి చిత్రాలకు ఆర్ఆర్, కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. మాకు మంచి టెక్నీషియన్లు దొరికారు. సాంతు ఓంకార్ తన ఆర్ఆర్, మ్యూజిక్‌తో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. రమీజ్ కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది.

‘నింద’ షూటింగ్‌లో ఎదురైన సవాళ్లు ఏంటి?
కానిస్టేబుల్ అనే సినిమా షూటింగ్‌లో నా కాలికి గాయమైంది. ఆ వెంటనే నింద షెడ్యూల్ ఉంది. అప్పటికే ఆర్టిస్టులంతా రెడీగా ఉన్నారు. అంతా సెట్ అయి ఉంది. నా ఒక్కడి కోసం షూటింగ్ క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక.. రాజేష్ గారి డెడికేషన్, ఫ్యాషన్ చూసి.. ఆ గాయంతోనే షూటింగ్ చేశాను. రాజేష్ గారి కోసమే ఆ రిస్క్ తీసుకున్నాను.

దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథంతో ప్రయాణం ఎలా ఉంది?
రాజేష్ గారి రూపంలో నాకు ఓ మంచి వ్యక్తి పరిచయం అయ్యారు. నాకు సొంత బ్రదర్‌లా మారిపోయారు. ఓ వయసు దాటాకా.. మనకంటూ కొత్త స్నేహితులు ఏర్పడరు. కానీ నాకు రాజేష్ లాంటి మంచి వ్యక్తి ఈ చిత్రంతో పరిచయం అయ్యారు.

మైత్రీ వారు ఈ ప్రాజెక్ట్‌ను ఎలా టేకప్ చేసి రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు?
మా దర్శక నిర్మాత రాజేష్ గారి ఫ్రెండ్ యూఎస్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆయన మైత్రీ నవీన్‌ గారికి తెలుసు. అలా మైత్రీ శశి గారు మా సినిమాను చూశారు. మూవీ నచ్చితేనే రిలీజ్ చేస్తామని శశిగారు అన్నారు. ఆయన చిత్రాన్ని చూశారు. బాగా నచ్చింది. అందుకే మా సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు.

నెక్ట్స్ ప్రాజెక్టులు ఏంటి?
నింద తరువాత ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాను. నిందలోని కారెక్టర్‌కు ఆ సినిమాలోని పాత్రకు అస్సలు పోలిక ఉండదు. అది జూలైలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. అది కాకుండా కానిస్టేబుల్ అనే ఓ సినిమాను కూడా చేస్తున్నాను.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago