విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకున్న ‘బుల్లెట్’ చిత్రం

‘బుల్లెట్’ చిన్న చిత్రం కాదు.. మంచి సినిమా

శ్రీ బండి సదానంద్ & మెమరీ మేకర్స్ సోమిసెట్టి హరికృష్ణ సమర్పించు, తుమ్మూరు  కోట ఫిలిం సర్క్యూట్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం బుల్లెట్. ఎవ్వడికైనా దిగుద్ది ట్యాగ్ లైన్ తో దర్శకుడు చౌడప్ప రూపొందించారు. 

 హీరో రవి వర్మ, సంజనా సింగ్, ఆలోక్ జైన్ ,మనీషా దేవ్, జీవ ,విజయ రంగరాజు ,సంధ్య శ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రలు పోషించారు.  మార్చి 8న  విడుదలైన ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా ఇంకా థియేటర్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్ర 50 రోజుల వేడుకను నిర్వహించారు. 

ముఖ్య అతిథులుగా శోభారాణి, దర్శకులు వి సముద్ర హాజరయ్యారు. 

శోభారాణి గారు మాట్లాడుతూ..”చిన్న చిత్రాలు రెండు మూడు రోజులు కూడా ఆడని ఈ రోజుల్లో *బుల్లెట్* 50 రోజులు పూర్తి చేసుకొని ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవడం మామూలు విషయం కాదు. *బుల్లెట్* ఇప్పుడు చిన్న సినిమా కాదు మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. దర్శకుడు చౌడప్ప గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన డైరెక్టర్ గా మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్” అని చెప్పారు. 

దర్శకుడు వి సముద్ర మాట్లాడుతూ..”బుల్లెట్ చిత్రం 50 రోజుల వేడుక చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. గోపీచంద్ ప్రభాస్ లాగా ఈ చిత్రంలోని హీరో రవివర్మ కూడా చాలా హైట్ ఉన్నాడు. తను కూడా వాళ్ళ లాగా సక్సెస్ అవ్వాలని కోరుతూ అందరికీ ఆల్ ద బెస్ట్” అని అన్నారు. 

హీరో రవివర్మ మాట్లాడుతూ..”మా సినిమాని ఇంతలా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నేను నటించిన మొదటి చిత్రమే 50 రోజులు పూర్తి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది” అని చెప్పారు. 

దర్శకుడు చౌడప్ప మాట్లాడుతూ..”మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్” అని చెప్పారు.

నిర్మాత గోపాల్ గారు మాట్లాడుతూ..”ఈ సినిమా విజయం పై మొదటి నుంచి నమ్మకంగా ఉన్నాం. అనుకున్నట్టుగా విజయం సాధించడంతో పాటు 50 రోజులు వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు చౌడప్ప పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆయనకు నా అభినందనలు తెలియజేస్తున్నా” అని అన్నారు. 

చిత్ర యూనిట్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. 

నటీనటులు

హీరో రవి వర్మ, సంజనా సింగ్, ఆలోక్ జైన్ ,మనీషా దేవ్, జీవ ,విజయ రంగరాజు ,సంధ్య శ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు, సందీప్ రెడ్డి ,ఆనంద్ జాషువా,  వైజాగ్ ప్రసాద్ ,గిరిధర్, మల్లికార్జున రావు, జగన్ తదితరులు

 సాంకేతిక నిపుణులు

నిర్మాత :- ఎం సి రావు ,జి గోపాల్ ,ఎమ్.వి మల్లి ఖార్జునరావు ,కోసూరి సుబ్రహ్మణ్యం ,మని

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం :- చౌడప్ప

డైరెక్టన్ డిపార్ట్మెంట్ :- సుధీర్ రెడ్డి ,గురునాథం ,వెంకట్ ,శివ

మాటలు :- నివాస్

కెమెరా :- ఆనంద్ మురుకురి

సంగీతం :- సుభాష్ ఆనంద్

ఎడిటర్ :- నందమూరి హరి

బ్యాగ్రౌండ్ స్కోర్, ఆర్.ఆర్ :- చిన్న

ఆర్ట్స్ :- రామకృష్ణ

మేకప్ :- శివ

క్యాస్ట్యూమ్స్ :- నాగరాజు

ప్రొడక్షన్ మేనేజర్ :- బాబు

పి.ఆర్.ఓ :- హర్ష

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago