త్వ‌ర‌లోనే నితిన్ 36వ సినిమా షూటింగ్ ప్రారంభం

  • నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న యూనిక్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌..

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నితిన్ త‌న 36 సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్‌ శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ర‌థ స‌ప్త‌మి సంద‌ర్భంగా సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు .

విభిన్న‌మైన క‌థ‌లు, క‌థ‌నాల‌తో సినిమాల‌ను రూపొందించే ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ మ‌రోసారి ఈ భారీ ప్రాజెక్ట్‌తో క్రియేటివ్ బౌండ‌రీస్ రేంజ్‌ను మ‌రింత పెంచ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. సినీ ప్రేక్ష‌కుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా ఈ క్రేజీ సినిమా రూపొంద‌నుంది. ఊరు పేరు భైర‌వ‌కోన చిత్రం త‌ర్వాత ఈ విజ‌న‌రీ డైరెక్ట‌ర్ హై కాన్సెప్ట్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నారు.

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్ హీరోగా న‌టిస్తుండ‌టంతో ఈ మూవీపై ఎగ్జ‌యిట్‌మెంట్ మ‌రింత‌గా పెరిగింది. వెర్స‌టైల్‌, ప‌వ‌ర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకునే నితిన్ వంటి క‌థానాయ‌కుడితో..క్వాలిటీ సినిమాల‌ను గ్రాండ్ స్కేల్‌లో సినిమాను రూపొందించే శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ సంస్థ‌ చేతులు క‌ల‌ప‌టం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఆస‌క్తిని పెంచుతోంది.

ఈ ప్రెస్టీజియ‌స్ కాంబోను చూస్తుంటే సినిమాపై నిర్మాత శ్రీనివాస చిట్టూరికి ఉన్న ప్యాష‌న్ క‌నిపిస్తోంది. ఆదివారం (జ‌న‌వ‌రి 25) ర‌థ స‌ప్త‌మి సంద‌ర్భంగా ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. త్వ‌ర‌లోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. టాలెంటెడ్ హీరో, వైవిధ్యంగా సినిమాను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు, గ్రాండ్‌గా సినిమాను నిర్మించే సంస్థ క‌ల‌యిక‌లో రూపొంద‌బోయే ఈ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్ నితిన్ కెరీర్‌లో అత్యంత ఆస‌క్తిక‌ర‌మై ప్రాజెక్ట్స్‌లో ఒక‌టిగా మార‌నుంది.

నితిన్ 36వ సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌నున్నారు.

న‌టీన‌టులు:

నితిన్‌

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: వి.ఐ.ఆనంద్‌
నిర్మాత‌: శ్రీనివాస చిట్టూరి
బ్యాన‌ర్‌: శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్‌
స‌మ‌ర్ప‌ణ‌: ప‌వ‌న్ కుమార్‌
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా
మార్కెటింగ్: విష్ణు తేజ్‌ పుట్ట

TFJA

Recent Posts

ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహవిష్కరణ

తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…

3 hours ago

రికార్డులు తిరగరాస్తున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…

6 days ago

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి సాత్విక వీరవల్లి పరిచయం

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో బ‌హు భాషా న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్‌ దుల్క‌ర్ స‌ల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…

6 days ago

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 weeks ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 weeks ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

3 weeks ago