‘భోగి’ హైదరాబాదులోని భారీ సెట్ లో కీలక టాకీ షూటింగ్ షెడ్యూలు ప్రారంభం

Must Read

చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది, కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్  ‘భోగి’ హైదరాబాదులోని భారీ సెట్ లో కీలక టాకీ షూటింగ్ షెడ్యూలు ప్రారంభం

చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ భోగి. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.

1960 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ స్పార్క్ అనే పవర్ ఫుల్ కాన్సెప్ట్ వీడియో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా కొత్త షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్‌లో ప్రారంభమయ్యింది. ఈ కీలక షెడ్యూల్లో టాకీ పార్ట్ ని చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాలో శర్వా నెవర్ బిఫోర్ పాత్రలో కనిపించనున్నారు.

అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

1960ల ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర ప్రాంతంలో వింటేజ్ సెట్టింగ్ తో ‘భోగి’ టెక్నికల్ గా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. డిఓపి కిషోర్ కుమార్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

భోగి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్
మ్యూజిక్; భీమ్స్
డిఓపి: కిషోర్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News