ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మోహ‌ర్ ర‌మేష్ విడుద‌ల చేసిన ది బ‌ర్త్‌డే బాయ్ టీజ‌ర్

ప్రస్తుతం ప్రేక్ష‌కుల అభిరుచి మారింది. కొత్త‌ద‌నంతో కూడిన న్యూ ఏజ్ సినిమాల‌కు వాళ్లు ప‌ట్టం క‌డుతున్నారు. అందుకే ద‌ర్శ‌కులు కూడా వారి ప‌ల్స్‌ను ప‌ట్టుకుని విభిన్న‌మైన క‌థ‌ల‌తో, వైవిధ్య‌మైన సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా అదే కోవ‌లో మ‌రో విభిన్న‌మైన ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ది బ‌ర్త్‌డే బాయ్‌. బొమ్మ బొరుసా ప‌తాకంపై నిర్మాణం జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కి ద‌ర్శ‌కుడు.

జూలై 19న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం టీజ‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మోహ‌ర్ ర‌మేష్ విడుద‌ల చేశారు. టీవీలో స్నేహితులు బాలుకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఓపెన్ అయిన టీజ‌ర్, ఆ త‌రువాత ప‌లు ఎంట‌ర్‌టైనింగ్ స‌న్నివేశాల‌తో కొన‌సాగుతుంది. టీజ‌ర్ చూస్తుంటే కొత్త‌ద‌నంతో కూడిన సినిమాలా అనిపిస్తుంది. టీజ‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ సినిమా చూడాల‌నే ఉత్సుక‌త‌ను క‌లిగించేలా టీజ‌ర్ క‌ట్ వుంది. ఈ సంద‌ర్భంగా దర్శ‌కుడు చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ప్ర‌తి పాత్ర‌, ప్ర‌తి స‌న్నివేశం కొత్త‌గా వుంటుంది.


ఎం.ఎస్ చ‌ద‌వ‌డానికి విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఐదుగురు చిన్న‌నాటి స్నేహితుల‌కు జ‌రిగిన సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. ఐదుగురు స్నేహితుల‌కు ఎదురైన అనుభ‌వాలు, వాటి ప‌ర్య‌వ‌సానాలు చాలా ఆస‌క్తిక‌రంగా వుంటాయి.


ఈ సినిమా స‌హ‌జ‌త్వం కోసం సింక్ సౌండ్ వాడాం. కంటెంట్‌తో పాటు మంచి టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వుండ‌బోతుంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి ప్ర‌య‌త్నించాం. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం వుంది. ఈ నెల 19న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం* అన్నారు.
ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల, ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఐ.భ‌ర‌త్‌,
డీఓపీ : సంకీర్త్ రాహుల్‌, సంగీతం: ప్ర‌శాంత్ శ్రీ‌నివాస్, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ఏఆర్ వంశీ.జి, ఎడిట‌ర్‌: న‌రేష్ ఆడుపా, సింక్ సౌండ్ డిజైన్‌:
సాయి మ‌ణిధ‌ర్ రెడ్డి, సౌండ్ మిక్సింగ్‌: అర‌వింద్ మీన‌న్‌, మేక‌ప్ చీఫ్‌:
వెంక‌ట్ రెడ్డి, డిజిటల్ మార్కెటింగ్‌: ఫ‌స్ట్ షో, పీఆర్ ఓ: ఏలూరు శ్రీ‌ను, మ‌డూరి మ‌ధు

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

8 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago