ప్రేక్షకులకు ధన్యవాదాలు మా సినిమాను ఆదరిస్తునందుకు

విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై నందు విజ‌య్‌కృష్ణ హీరోగా.. యాంక‌ర్ ర‌ష్మి గౌతమ్ హీరోయిన్ గా రాజ్ విరాట్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌’. ఈ నెల 4 న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్స్ లో ప్రదర్శింపబడుతుంది. అయితే ఈ రోజు నుండి మరి కొన్ని థియేటర్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో పెంచుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.చిత్ర నిర్మాతల్లో ఒకరైన బోసుబాబు మాట్లాడుతూ..  నందు,విరాట్, రష్మీ లు ఎంచుకొన్న కథకు. సీనియర్ ఆర్టిస్టులను కాకుండా కొత్త ట్యాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చెయ్యాలని ఉద్దేశ్యంతో  తీసిన మా సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. దాంతో ఈ రోజు నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ను పెంచుతున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు.ఈ సినిమా సక్సెస్ తో విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై మంచి సినిమాలు తియ్యాలనే ప్రెజర్ పెరిగింది. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మా ధన్యవాదములు అన్నారు.

చిత్ర దర్శకుడు రాజ్ విరాట్  మాట్లాడుతూ..నా ఈ ఫస్ట్ ప్రాజెక్ట్స్  లో  విడుదలైన  “బొమ్మ బ్లాక్ బస్టర్” సినిమాకు ప్రేక్షకులనుండి ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. దీనికి హీరో నందు ,హీరోయిన్ రష్మీ , నిర్మాతలే  ప్రధాన కారణం. వీరి సపోర్ట్ చేయడం వల్లే నాకింత  మంచి పేరు వచ్చింది. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ వచ్చి చూసేలా ఉంటుందని అన్నారు.చిత్ర హీరో నందు విజ‌య్‌కృష్ణ  మాట్లాడుతూ..ఇంతమంచి  విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదములు. ఇందులో నేను చేసిన పాత్రకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది..ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా పోతురాజు అనే క్యారెక్టర్ తో ట్రావెల్ చేస్తారు. అలాగే ఇందులో ఉన్న పోకిరి సీన్ మాత్రం అందరికీ నచ్చుతుంది. భాస్కరపట్ల రాసిన నాన్న సెంటిమెంట్ కు అన్ని చోట్ల  నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి కథతో థియేటర్స్ లలో విడుదలైన  మా సినిమాను చూసి ఆదరించి ఆశీర్వదించాలని  మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

హీరోయిన్ రష్మీ గౌతమ్  మాట్లాడుతూ.. మంచి కథను  సెలెక్ట్  చేసుకొని అంతా కొత్త వారితో మేము తీస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అనుకున్నాము.అయితే మేము అనుకున్న దానికి భిన్నంగా ప్రేక్షకులు మా కథను  రిసీవ్ చేసుకున్నారు. వారందరికి ధన్యవాదములు. ఇందులో నాన్న, సెంటిమెంట్ కు అందరూ కనెక్ట్ అవుతున్నారు. ఇందులో నన్ను  వాణి క్యారెక్టర్ లో దర్శకుడు బాగా చూయించారు.హీరో నందు పోతురాజు క్యారెక్టర్ కు స్మాల్ టౌన్  నుండి వచ్చే ప్రతి అబ్బాయి  కనెక్ట్ అవుతారు.ఇంకా మా సినిమా చూడని వారుంటే  చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని అన్నారు.

న‌టీన‌టులు
నందు విజ‌య్ కృష్ణ‌‌, ర‌ష్మీ గౌత‌మ్, కిరిటి, ర‌ఘు కుంచె త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం
రచన – దర్శకత్వం : రాజ్ విరాట్
నిర్మాతలు : ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ
మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి
పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలే
ఎడిటర్ : బి. సుభాష్కర్
సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్
పీ.ఆర్.ఓ : ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Tfja Team

Recent Posts

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

7 hours ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

1 day ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

2 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

2 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

2 days ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

2 days ago