విజయ్ సినిమా కెరీర్‌లో ఆఖరి చిత్రం దళపతి 69ని అత్యంత వైభవంగా ప్రారంభించింది కేవీయన్ ప్రొడక్షన్స్. పూజా కార్యక్రమాలతో భారీ సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. నవరాత్రుల్లో రెండో రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కావడం ఆనందంగా ఉందంటున్నారు మేకర్స్. సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో ఆత్మీయంగా జరిగింది దళపతి 69 మూవీ పూజ.
శనివారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. దళపతి కెరీర్‌లో హిస్టారిక్ ప్రాజెక్ట్ ఇది. సిల్వర్‌స్క్రీన్ మీద ఆయన చివరిసారిగా కనిపించనున్న చిత్రం ఇదే. దళపతి ఫ్యాన్స్ కి ఇదొక ఎమోషనల్ ప్రాజెక్ట్.విజయ్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నారు. బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపిస్తారు. గౌతమ్ వాసుదేవ మీనన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ ప్రియమణి, వెటరన్ యాక్టర్ ప్రకాష్ రాజ్, రెయిజింగ్ స్టార్ మమిత బైజు ప్రధాన పాత్రల్లో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు.
హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కేవీయన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వెండితెరమీద విలక్షణమైన నటనతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న విజయ్ కెరీర్‌లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న సినిమా ఇది. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారు. ప్రదీప్ ఇ రాఘవ్ ఈ సినిమాకు ఎడిటింగ్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. అనల్ అరసు యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. సెల్వ కుమార్ ఆర్ట్ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. పల్లవి సింగ్ కాస్ట్యూమ్స్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. ‘ధీరన్ అదిగారమ్ ఒండ్రు’, ‘మాస్టర్’ సినిమాలకు పనిచేసిన సత్యన్ సూర్యన్.. దళపతి 69 ని మరో రేంజ్‌లో చూపిస్తారనే కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ప్రేక్షకుల్లో క్రియేట్ అయింది.
ప్యాన్ ఇండియా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తమిళ్, తెలుగు, హిందీలో 2025 అక్టోబర్‌లో విడుదల కానుంది ఈ సినిమా. విజయ్ లెగసీని దృష్టిలో పెట్టుకుని, ఆయన నటిస్తున్న చివరి సినిమాను అత్యంత భారీగా, తరాలు గుర్తుపెట్టుకునేలా తెరకెక్కించే పనిలో ఉన్నారు మేకర్స్.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…