తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో శనివారం (ఏప్రిల్ 26 న) ఫీనిక్స్ ఫౌండేషన్ & శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా తెలుగు ఫిలిం చాంబర్‌లో హెల్త్ క్యాంప్ నిర్వహించాయి. జర్నలిస్టులకు ‘ఐ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో & యాక్టర్ ప్రియదర్శి, యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగ వంశీ, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రియదర్శి, నాగ వంశీ రిబ్బన్ కట్ చేసి హెల్త్ క్యాంప్ ప్రారంభించగా… అనంతరం ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిక్ హెడ్ విశ్వమోహన్, TFJA ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ రఘు, జనరల్ సెక్రటరీ వై.జె. రాంబాబు చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన జరిగింది.
హెల్త్ క్యాంప్‌లో భాగంగా ప్రియదర్శి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆయన చూపు పర్ఫెక్ట్ ఆల్ రైట్ అని వైద్యులు తెలిపారు. హెల్త్ క్యాంప్ గురించి ప్రియదర్శి మాట్లాడుతూ… ”తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన హెల్త్ క్యాంప్‌కు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ క్యాంప్ నిర్వహిస్తున్న అసోసియేషన్ పెద్దలకు, ఫీనిక్స్ ఫౌండేషన్ అవినాష్ చుక్కపల్లి గారికి, శంకర్ ఐ హాస్పిటల్ మోహన్ గారికి థాంక్స్. జర్నలిస్టుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటున్న అసోసియేషన్ పెద్దలకు స్పెషల్ థాంక్స్. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి” అని చెప్పారు.
శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ‘ఐ స్క్రీనింగ్’ హెల్త్ క్యాంప్‌లో జర్నలిస్టులు, వాళ్ల కుటుంబ సభ్యులు 100 మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…