స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘తెలుసు కదా’తో అలరించబోతున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. నీరజ కోన, సిద్దు స్టార్‌డమ్‌ను దృష్టిలో ఉంచుకుని పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాలని నిర్మించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ను చాలా గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు రోలింగ్ కి రెడీ అయ్యింది.
‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌లో టాకీ పార్ట్స్ తో పాటు సాంగ్స్ ని షూట్ చేస్తారు. హైదరాబాద్‌లో 30 రోజుల పాటు సాగే షెడ్యూల్ ఇది. మూవీ లీడ్ కాస్ట్ షూటింగ్‌లో పాల్గొంటారు.
నిర్మాతలు ప్రీ-ప్రొడక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. టైటిల్ గ్లింప్స్ గ్రాండ్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌ని సూచిస్తుంది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ సినిమా కోసం సిద్దూ జొన్నలగడ్డ స్టైలిష్‌గా మేకోవర్ కానున్నారు. వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్నారు.
హై బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు.
థమన్ ఎస్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు.
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష
రచన, దర్శకత్వం: నీరజ కోన
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: జ్ఞాన శేఖర్ VS
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
పీఆర్వో: వంశీ-శేఖర్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…