‘రామ్‌ ఎన్‌ఆర్‌ఐ’ చిత్రం నుంచి ‘తెల్లవారే వెలుగుల్లోనా’ పాట విడుదల

ఫీల్‌గుడ్‌ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. అలాంటి సినిమాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే వుంటాయి. ఆ కోవలోనే రూపొందుతున్న మరో ఫీల్‌ గుడ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రామ్‌ ఎన్‌ఆర్‌ఐ’. ‘పవర్‌ ఆఫ్‌ రిలేషన్ షిప్‌’ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీ రజా కథానాయకుడిగా, సీతా నారాయణన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎన్.లక్ష్మీ నందా దర్శకుడు. మువ్వా క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్‌కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తెల్లవారే వెలుగుల్లోనా అనే తొలి లిరికల్‌ వీడియోను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్‌ గారు మాట్లాడుతూ… ‘ ఈ పాటను చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అందాలను ఒడిసి పట్టి చాలా అందమైన, అద్భుతమైన లోకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించినట్లుగా కనిపిస్తుంది. ఈ పాట ద్వారా మంచి లోకేషన్స్‌ను దర్శక, నిర్మాతలు సెల్యూలాయిడ్స్‌పైకి తెచ్చినందుకు అభినందనలు. సినిమా విజువల్స్‌ చూస్తుంటే ది బెస్ట్‌ సాంకేతిక విలువలతో నిర్మించిన సినిమాలా అనిపిస్తుంది. నాగబాబు కర్రా అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ పాటలో కనిపిస్తుంది. మన మాతృభూమికి మనం ఎంతో కొంత చేయాలి. మన మూలాలను మరిచిపోకూడదు అనే ఆలోచనతో మంచి కాన్సెప్ట్‌తో, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడికి, నిర్మాతకు నా అభినందనలు. ఇంత మంచి సినిమాకు వర్క్‌ చేసిన టీమ్‌కు కూడా నా శుభాకాంక్షలు. ఈ నెల 21న జరగనున్న ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకతో పాటు ఈ చిత్రం కూడా విజయవంతం కావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను’ అన్నారు.

శ్రవణ్‌ సంగీతం సమకూర్చిన ‘తెల్లవారే వెలుగుల్లోనా’ అనే ఈ పాటకు రామాంజనేయులు యామినేని సాహిత్యం అందించగా, గాయకుడు రేవంత్‌ ఆలపించారు. పల్లె గొప్పతనాన్ని, గ్రామీణ అందాలను చూపిస్తూ తెరకెక్కిన ఈ పాట విజువల్‌గా కూడా ఆకట్టుకునే విధంగా వుంది. ‘పల్లెసీమకు ఎగిరే.. మనసే ఆనందంలో ఎగిరే.. ఊరివైపు పయనించే….’ అని పాడుతూ హీరో అలీ రజా ఎంతో హుషారుగా..ఎనర్జీగా ఈ పాటలో కనిపిస్తాడు. మంచి లిరికల్‌ విలువలతో కూడిన ఈ పాట వినగానే క్యాచీగా వుంది.

తారాగణం: అలీ రజా, సీతా నారాయణన్‌, విజయ్‌చందర్‌, గీతాంజలి, మువ్వ సత్యానారాయణ, సన, సూర్య, రఘు, జోగి నాయుడు, వేణుగోపాల్‌, రవివర్మ, జయవాణి, శ్రీమణి, మైనా

సాంకేతిక నిపుణులు:
కథ, స్కీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్‌.లక్ష్మీ నందా(డీఎఫ్‌ టెక్‌)
నిర్మాత: మువ్వా సత్యనారాయణ
సమర్పణ: ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్‌కృష్ణ
సంభాషణలు: వీరబాబు బాసిన
సాహిత్యం: రామాంజనేయలు యామినేని
సంగీతం: శ్రవణ్‌
సినిమాటోగ్రఫర్‌: నాగబాబు కర్రా
ఎడిటర్‌: కె.రమేష్
ఆర్ట్‌: జేకే మూర్తి
ఫైట్స్‌: సూపర్‌ ఆనంద్‌
కొరియోగ్రఫీ: రేలంగి కిరణ్‌

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

2 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago