చంద్రబోస్ ని ఘనంగా సన్మానించిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్

“నాటు నాటు” పాట‌కు అందించిన సాహిత్యానికి గాను ఆస్కార్ అవార్డు గెలిచి తెలుగు ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తం చేసిన లిరిసిస్ట్ చంద్ర‌బోస్‌గారిని ఆయ‌న నివాసంలో ఘనంగా స‌న్మానించారు తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్  ల‌య‌న్‌ డా.ప్ర‌తానిరామ‌కృష్ణ‌గౌడ్ . ఈ సంద‌ర్భంగా దుబాయ్‌లో జ‌ర‌గ‌నున్న టిఎఫ్‌సిసి నంది అవార్డుల వేడుక‌కు చంద్ర‌బోస్‌గారిని ఆత్మీయంగా ఆహ్వానించారు. దుబాయ్ వేదిక‌పై అక్క‌డి దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా చంద్రబోస్ కి టిఎఫ్‌సిసి నంది అవార్డు అందించనున్నారు.    

 ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్  మాట్లాడుతూ.. “చంద్ర‌బోస్‌గారితో నాకు ఎప్ప‌టినుంచో మంచి అనుబంధం ఉంది.. నేను నిర్మించి ద‌ర్శ‌కత్వం వ‌హించిన జోడి నెంబర్.1, సర్దార్ పాపన్న మరియు అనేక చిత్రాల‌కు ఆయ‌న సాహిత్యాన్ని అందించారు.. త‌న సాహిత్యంతో ఆస్కార్ గెలుచుకుని తెలుగు ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిచెప్పిన చంద్రబోస్‌గారికి నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు అని అన్నారు.

  ఈ సందర్భంగా  ఆస్కార్ విజేత, సాహితీవేత్త చంద్రబోస్ మాట్లాడుతూ…“ సంపూర్ణ  భార‌తీయ చిత్రానికి వ‌చ్చిన మొట్ట మొద‌టి  ఆస్కార్ పుర‌స్కార‌మిది.  అది మ‌న తెలుగుకి, నేను రాసిన పాట‌కి రావ‌డం మ‌రింత ఆనంద‌గా ఉంది.  ఇది మాట‌ల్లో వ‌ర్ణించ‌లేని అనుభూతి . స్వ‌ప్నంలో కూడా స్వప్నించ‌ని స్వ‌ప్నం  ఇది.  ఈ పాట రాసేట‌ప్పుడు కీర‌వాణి గారు, రాజ‌మౌళి గారు మెచ్చుకుంటే చాలు… ఆ త‌ర్వాత ప్ర‌జలు ఆద‌రిస్తే చాలు అనుకున్నా. కానీ ఆస్కార్ అవార్డ్ రావ‌డం ఎంతో సంతోషం. ఒక జాతీయ పుర‌స్కారం వ‌స్తే చాలు  అదే ఈ జ‌న్మ‌కు సార్థ‌క‌త అనుకునే వాణ్ని. అలాంటిది నాలుగు అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు  ఇవ్వ‌డంతో   నా జ‌న్మ ధ‌న్య‌మైంది.  చాలా ఆనందంగా ఉంది.  అందులో తెలుగు పాట‌కు ఆస్కార్ వ‌చ్చినందుకు,  తెలుగు వారి శ‌క్తి సామ‌ర్థ్యాలు విశ్వ వేదిక‌పై చాటి చెప్పినంద‌కు మ‌రింత ఆనందంగా ఉంది.  ఈ పాట‌లో ప్ర‌తి వాక్యం నా భార్య జ్ఞాప‌కాలు. మా ఊళ్లో నేను అనుభ‌వించిన జీవితం, నా నేప‌థ్యం, నా ప‌రిస‌రాలు, నా కుటుంబం… వీట‌న్నింటిని క‌లిపి నాటు నాటు పాట‌గా రాసాను.  ఇక తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ తరపున నన్ను సన్మానించిన ఆర్ కె గౌడ్ గారికి, ఛాంబర్ సభ్యులందరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. త్వరలో దుబాయిలో జరిగే టి యఫ్ సి సి  నంది అవార్డుల వేడుకకు నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు“ అన్నారు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago