వంశీ పైడిపల్లి చేతుల మీదుగా నార్నే నితిన్ శ్రీ శ్రీ శ్రీ రాజావారు టీజర్ రిలీజ్

“మ్యాడ్”, “ఆయ్” చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో నార్నే నితిన్, “శతమానం భవతి” సినిమాతో టాలీవుడ్ కు నేషనల్ అవార్డ్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న, శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై “గుర్తుందా శీతాకాలం” వంటి సక్సెస్ ఫుల్ సినిమా చేసిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్ చింతపల్లి రామారావు బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు”. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో సంపద హీరోయిన్ గా నటిస్తోంది. దసరా పండుగకు ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” సినిమా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” టీజర్ చూశాను చాలా బాగుంది. ప్రేమను ఎలక్షన్స్ తో పోలుస్తూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. దర్శకుడు సతీష్ వేగేశ్న గారు గతంలో శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెల్చుకున్నారు. ఈ సినిమా టీజర్ చూస్తే ఆయన ఫ్లేవర్ లోనే మూవీ ఉంటుందని తెలుస్తోంది. మంచి లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. నార్నే నితిన్ నాకు ఎన్టీఆర్ గారి మ్యారేజ్ టైమ్ నుంచి తెలుసు. మ్యాడ్, ఆయ్ సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా ఎదుగుతున్నాడు. ఆయనకు ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందని నమ్ముతున్నాను. నార్నే నితిన్ ను మాసీగా ప్రెజెంట్ చేశారు సతీష్ వేగేశ్న గారు. రామారావు గారు ఎప్పటినుంచో ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్ రామారావు గారికి కూడా నా బెస్ట్ విశెస్ చెబుతున్నా. రావు రమేష్ గారు, నరేష్ గారు లాంటి మంచి యాక్టర్స్ ఈ చిత్రంలో నటించారు. దసరా పండుగకు ఫ్యామిలీ అంతా కలిసి చూసే పర్పెక్ట్ మూవీ ఇది. ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ – ఈ రోజు మా ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” సినిమా టీజర్ ను నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆయన మా టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించినందుకు థ్యాంక్స్ చెబుతున్నాం. మ్యాడ్, ఆయ్ సినిమాల తర్వాత యంగ్ టాలెంటెడ్ హీరో నార్నే నితిన్ కు మా ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” సినిమా హ్యాట్రిక్ హిట్ కాబోతోంది. శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెల్చుకున్న దర్శకులు సతీష్ వేగేశ్న గారు మరోసారి మంచి లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని రూపొందించారు. ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” సినిమాను హై బడ్జెట్ తో క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. దసరాకు మా మూవీని థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. ఈ దసరా సంబరాలను రెట్టింపు చేసే చిత్రమిది. మీరంతా దసరా పండుగను మా ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” సినిమాతో సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. అన్నారు.

నటీనటులు – నార్నే నితిన్, సంపద, రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి, తదితరులు

టెక్నికల్ టీమ్

సంగీతం: కైలాష్ మీనన్
కెమెరా: దాము నర్రావుల
ఎడిటర్: మధు
పాటలు: శ్రీమణి
పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్
స్టిల్స్: రమేష్. ఎన్
పీఆర్ఓ: బి. వీరబాబు
సమర్పణ: రంగాపురం రాఘవేంద్ర, మురళీ కృష్ణ చింతలపాటి
కో ప్రొడ్యూసర్:సుబ్బారెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీహెచ్.వి. శర్మ, రాజీవ్ కుమార్

నిర్మాత: చింతపల్లి రామారావు,
రచన – దర్శకత్వం: సతీష్ వేగేశ్న

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago