రాకింగ్ స్టార్ యష్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో రెబెకా పాత్ర‌లో తారా సుతారియా.. లుక్ విడుద‌ల చేసిన మేక‌ర్స్‌

రాకింగ్ స్టార్ య‌ష్ ప్రెస్టీజియ‌స్ మూవీ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’పై రోజు రోజుకీ అంచ‌నాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే ఈసినిమా నుంచి నాడియా పాత్ర‌లో న‌టిస్తోన్న కియారా అద్వానీ.. మిస్టీరియ‌స్‌, గ్లామ‌ర‌స్ ఎలిజిబెత్ పాత్ర‌లో న‌టిస్తోన్న హుమా ఖురేషి.. పవర్ఫుల్ గంగ పాత్రలో నటిస్తోన్న నయనతార పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదలై టాక్సిక్ సినిమాలోని డార్క్ వ‌ర‌ల్డ్‌పై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత‌గా పెంచేశాయి.

 తాజాగా మేక‌ర్స్  అంద‌మైన, ఆక‌ర్ష‌ణీయ‌మైన‌, సున్నిత‌మైన రెబెకా పాత్ర‌లో న‌టిస్తోన్న తారా సుతారియా పాత్ర‌ను ప‌రిచ‌యం చేశారు. ఇలా సినిమాలోని పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేయ‌టం ద్వారా.. సినిమా స్కేల్ పాన్ ఇండియా రేంజ్‌ను తెలియ‌జేస్తోంది. ఇందులో హై యాక్ష‌న్ సీక్వెన్సెస్‌, భారీ డ్రామా, క‌థ‌లోని అనేక మ‌లుపులుండబోతున్నాయి. తాజాగా తారా సుతారియా లుక్‌ను రివీల్ చేశారు. ఇది ఆమెకు తొలి పాన్ ఇండియా మూవీ. ఆమె కెరీర్‌లో ఇదొక కొత్త అధ్యాయం.  

అందంగా, స్టైల్‌గా క‌నిపిస్తూనే రెబెకా పాత్ర‌లోని తారా సుతారియా గ‌న్స్‌ను ఉప‌యోగిస్తోన్న తీరు ఆక‌ట్టుకుంటోంది. పోస్ట‌ర్ చూస్తుంటే త‌న‌ను తాను ర‌క్షించుకోగ‌ల ధైర్యం, సామ‌ర్థ్య‌మున్న పాత్ర‌లో ఆమె మెప్పించ‌నుంది. అంద‌మైన అమ్మాయిగా టాక్సిక్ అనే ప్ర‌మాద‌క‌ర‌మైన‌, క‌ఠిన‌మైన ప్ర‌పంచంలోకి అడుగు పెడుతుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కురాలు గీతూ మోహ‌న్ దాస్ మాట్లాడుతూ ‘‘తారా నుంచి స‌హ‌జ‌మైన ప్రేను ఆస్వాదించాను. ఆమె స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సు క‌లిగిన వ్య‌క్తి. అదే ఆమెకు ర‌క్ష‌ణ అని అనుకుంటున్నాను. దీని గురించి అంద‌రికీ తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం లేదని భావిస్తున్నాను. న‌టిగా ఆమెకు ఇది కావాల‌ని బ‌లంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆమెకు కావాల్సినంత స్వేచ్చ‌ను ఇస్తే చాలు. అదే నేను చేశాను. ఇది మా బంధం బ‌ల‌మైందిగా మార‌టానికి దోహ‌ద‌ప‌డింది. ఆమె ప్ర‌తి విష‌యాన్ని సునిశితంగా గ‌మ‌నించేది. పాత్ర గురించి ఎక్కువ‌గా ఆలోచించేది. ఆమెను ఎలా గైడ్ చేయాలా ? అని నేను ఆలోచించిన సంద‌ర్భాలున్నాయి. కానీ ఆమె పాత్ర‌లో అద్భుతంగా జీవించింది. ఇది న‌న్నెంతో ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. న‌న్నే కాదు..  అంద‌రినీ ఇది ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంద‌న‌టంలో సందేహం లేదు’’ అన్నారు.

యష్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథను రాసి.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచ‌నాలున్నాయి. అద్భుత‌మైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వ‌ర్క్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను నేషనల్ అవార్డు గ్రహీత రాజీవ్ రవి నిర్వహిస్తుండగా.. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్‌ను ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్‌ను టీపీ అబీద్ చూసుకుంటున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ (జాన్ విక్ ఫేమ్)తో పాటు నేషనల్ అవార్డు గెలుచుకున్న అన్బరివ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేశారు.

‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ‌, య‌ష్ నిర్మిస్తున్నారు. సినిమా 2026 మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్‌ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

TFJA

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago