శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా ఇది. అసలు మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది మామూలు సాహసం కాదు. ఇలాంటి అద్భుతమైన ప్రయోగం చేసి మెప్పించేందుకు రెడీ అయింది ‘రా రాజా’ టీం. ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ్ వీక్షించి అభినందించారు. అనంతరం రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘రా రాజా మూవీ టైటిల్‌ను గమనిస్తే ఏదో ప్రేమ కథలా అనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో ఓ మొహం కూడా కనిపించదు. అసలు మొహాలు చూపించకుండా సినిమా తీసి దర్శకుడు శివ ప్రసాద్ ధైర్యం చేశాడు. డ్యూయెల్ అని స్పీల్ బర్గ్ తీసిన చిత్రంలోనూ మొహం కనిపించదు. అలానే ఈ చిత్రంలోనూ మొహాలు కనిపించవని అంటున్నారు. ఇది చాలా పెద్ద ప్రయోగం. ఇది కనుక సక్సెస్ అయితే ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది. అసలు హీరోలు, స్టార్లతో పని లేకుండా అద్భుతమైన చిత్రాలు, ప్రయోగాలు చేయొచ్చని అంతా ముందుకు వస్తారు. హీరో హీరోయిన్ల కోసం సినిమాలకు వస్తుంటారు. కానీ ఇందులో మొహాలు కూడా కనిపించవు. కథే ముందుకు వెళ్తుంటుంది. ఇది అద్భుతమైన ఐడియా. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ బాగుంది. మార్చి 7న ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయండ’ని అన్నారు.
దర్శకుడు శివ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘మా ట్రైలర్‌ను చూసి, రిలీజ్ డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేసి, అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి థాంక్స్. మా చిత్రంలో ఆర్టిసుల మొహాలు కనిపించవు. కథ, కథనమే ముఖ్యం అని మేం ఈ మూవీని తీశాం. ఇది ఒక ప్రయోగం. మా ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
సాంకేతిక బృందం
బ్యానర్ : శ్రీ పద్మిణి సినిమాస్
దర్శకుడు : బి.శివ ప్రసాద్
సంగీత దర్శకుడు : శేఖర్ చంద్ర
కెమెరామెన్ : రాహుల్ శ్రీ వాత్సవ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బూర్లే హరి ప్రసాద్
లైన్ ప్రొడ్యూసర్ : కిట్టు
పీఆర్వో : సాయి సతీష్
నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా.…
ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్తో ప్రేక్షకులను మెపిస్తూ వారి హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్…
యష్ రాజ్ ఫిల్మ్స్ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే (DDLJ) 30 వసంతాల సందర్బంగా…
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…