శ్రీ పాద క్రియేషన్స్ బ్యానర్ రెండో చిత్రం గా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ “తుఫాను హెచ్చరిక” ఫస్ట్ లుక్ విడుదల

శ్రీ పాద క్రియేషన్స్ పతకం , పై అల్లు రామకృష్ణ మరియు సుహానా ముద్వారి హీరో హీరోయిన్ గా
జగదీష్ కె కె దర్శకత్వం లో డాక్టర్ శ్రీనివాస్ కిషన్ అనాపు, డాక్టర్ రాజనీకాంత్ ఎస్, సన్నీ బాన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “తుఫాను హెచ్చరిక”. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేసారు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా దర్శకుడు జగదీష్ కె కె మాట్లాడుతూ, “ఈరోజు మా ‘తుఫాను హెచ్చరిక’ మొదటి పోస్టర్ ను విడుదల చేస్తున్నాం. ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఒక అందమైన హిల్ స్టేషన్ లో ఆహ్లాదంగా జీవించే ఒక అబ్బాయి జీవితంలోకి ఒక తుఫాను లాంటి విధ్వంసం జరిగితే, ఆ పరిస్థితులని ఎలా ఎదురుకున్నాడు మరియు ఎలా విజయం సాధించాడు అనేదే చిత్ర కథ.

ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాటిక్ విజన్ కు మా నటీనటులు మరియు టెక్నిషన్స్ ప్రాణం పోశారు. ఆ ఆర్టిస్ట్స్ అందరు అతి తక్కువ ఉష్ణోగ్రతలలో, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అద్భుతంగా నటించారు. లంబసింగి మరియు చింతపల్లి లాంటి అందమైన లొకేషన్స్ లో ప్రకృతి అందాల్లో సరైన విసువల్ కోసం ఏడాది కాలం ఓపికగా వేచి ఉంది సరైన అందాలను చిత్రీకరించాము.

హిల్ స్టేషన్ లో ఉండే ఆ ఫ్రెష్ నెస్ స్పష్టంగా ఫీల్ అయ్యేలా చేసిన మా సినిమాటోగ్రాఫర్ ఆర్ కె నాయుడు చాలా కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ పట్ల నా అభిరుచిని పంచుకుని చిత్రీకరణలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సపోర్ట్ చేసిన మా నిర్మాతలు డా.శ్రీనివాస్‌ కిషన్‌, డా.రజనీకాంత్‌, సన్నీ బన్సల్‌ లకి నా కృజ్ఞతలు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్, మ్యూజిక్, మిగిలిన అన్ని క్రాఫ్ట్ ల టెక్నీషియన్లు చాలా చక్కగా సహకరించారు.

షూటింగ్ అంత పూర్తీ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పన్నులో బిజీ గా ఉంది. మా చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం” అని తెలిపారు.

హీరో అల్లు రామకృష్ణ (రాఖి)
హీరోయిన్ – సుహానా ముద్వారి

బ్యానర్ – శ్రీ పాద క్రియేషన్స్ లిమిటెడ్, వింటేజ్ పిక్చర్స్.

సమర్పణ – సరయు తలశిల

దర్శకుడు – జగదీష్ కె కె

నిర్మాతలు – డాక్టర్ శ్రీనివాస్ కిషన్ ఆనాపు, డాక్టర్ రజినీకాంత్ ఎస్, సన్నీ బన్సల్

మాటలు – అరుణ్ వీర్
సినిమాటోగ్రఫీ – వి ఆర్ కె నాయుడు
ఎడిటర్ – జగదీష్ కె కె
ఆర్ట్ డైరెక్టర్ – బత్తుల శివ సాయి కుమార్
ప్రొడక్షన్ కంట్రోలర్ – శ్రీను ఇర్ల
కొరియోగ్రాఫర్ – ఆది పొన్నస్
లిరిక్స్ – శ్రీమని, ధర్మ గూడూరు
కాస్ట్యూమ్స్ – రేణు కియారా
సౌండ్ ఇంజనీర్ – రాధా కృష్ణ
పోస్టర్స్, లిరికల్ వీడియోస్ – జె కె ఫ్రేమ్స్
పి.ఆర్.ఓ – పాల్ పవన్,
డిజిటల్ టీం- S3 Digital Marketing

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago