టాలీవుడ్

ఘనంగా ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ వేడుక

అక్టోబర్ 31న ‘మాస్ జాతర’ చిత్రంతో రవితేజ జాతర చూడబోతున్నాం : ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ కథానాయకుడు సూర్య

‘మాస్ జాతర’ చిత్రం మీ అందరికీ నచ్చుతుంది : అభిమానులకు మాస్ మహారాజా రవితేజ హామీ

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న ‘మాస్ జాతర’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను, అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముఖ్య అతిథి, ప్రముఖ కథానాయకుడు సూర్య మాట్లాడుతూ.. “రవితేజ గారి అభిమానులను, నా అభిమానులను ఇలా చూడటం ఆనందంగా ఉంది. అభిమానుల మధ్యలో జరిగే ఇలాంటి వేడుకకు హాజరవ్వడం నాకిష్టం. నన్ను ఆహ్వానించిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. రవితేజ గారితో నాది 20 ఏళ్ళ అనుబంధం. ఈ రోజు ఒక ఫ్యాన్ బాయ్ లా మాట్లాడుతున్నాను. ఆయన పేరు వింటేనే ఆనందం కలుగుతుంది. ఎనర్జీ మనిషి రూపంలో ఉంటే అది రవితేజ గారు. చాలా ఏళ్లుగా రవితేజ గారిపై అభిమానులు ఎంతో ప్రేమని కురిపిస్తున్నారు. తెరపై ఒక కామన్ మ్యాన్ ని కింగ్ సైజ్ లో సహజంగా చూపించాలంటే అది రవితేజ గారికే సాధ్యమవుతుంది. తన సహజ నటనతో పాత్రకు ప్రాణం పోస్తారు. ఆయన నటనకు నేను అభిమానిని. నవ్వించడం అనేది చాలా కష్టం. కానీ, రవితేజ గారు మాత్రం తనదైన శైలిలో చాలా తేలికగా ఎన్నో ఏళ్ళుగా వినోదాన్ని పంచుతున్నారు. తెలుగు ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఆయన చేస్తారు. ఇడియట్, కిక్ సహా రవితేజ గారు నటించిన పలు సినిమాలు తమిళ్ లోనూ మంచి ఆదరణ పొందాయి. విక్రమార్కుడు రీమేక్ నా సోదరుడు కార్తీ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. రవితేజ గారిలా వినోదాన్ని పంచేవాళ్ళు అరుదుగా ఉంటారు. రజినీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు ఎలాగైతే వినోదాన్ని పంచగలరో రవితేజ గారు కూడా అలాగే అలరిస్తారు. రవితేజ గారు ఇలాగే వినోదాన్ని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్టోబర్ 31న మాస్ జాతర రూపంలో రవితేజ గారి జాతర చూడబోతున్నాం. రవితేజ గారిపై దర్శకుడు భానుకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలై, సపోర్టింగ్ యాక్టర్ గా, ఇప్పుడు మాస్ మహారాజాగా ఎదిగిన రవితేజ గారు ఎందరికో స్ఫూర్తి. నాగవంశీ గారు వరుస సినిమాలు చేస్తున్నారు. మంచి సినిమాలు చేస్తున్నారు. ఆయన బ్యానర్ లో నేను ఒక సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. భీమ్స్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాము. అక్టోబర్ 31 విడుదలవుతున్న మాస్ జాతర సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ, టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. “నాకిష్టమైన వ్యక్తుల్లో ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు ఒకరు. ఆయన వేసిన సెట్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రంలో యాక్షన్ బాగుందంటే ఆ క్రెడిట్ మా ఫైట్ మాస్టర్స్ వెంకట్, పృథ్వీకి వెళ్తుంది. మా సంగీత దర్శకుడు భీమ్స్ ఇంకో చార్ట్ బస్టర్ ఇచ్చాడు. ఈ సాంగ్స్ మీరు థియేటర్ లో విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. మా డీఓపీ విధు వర్క్ మీ అందరికీ నచ్చుతుం

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

2 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago