ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గర నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నారు సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్. ఇటీవల తనను కలిసిన సాయిదుర్గ తేజ్ కు సావర తెగలు చేసిన పెయింటింగ్ ను అందించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా సాయిదుర్గ తేజ్ షేర్ చేశారు.
సాయిదుర్గ తేజ్ స్పందిస్తూ – మామయ్య పవన్ కల్యాణ్ దగ్గర నుంచి అందుకునే బ్లెస్సింగ్స్ తో పాటు ఆయన ఇచ్చే ప్రతి గిఫ్ట్ ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పుడు నేను అందుకున్న ఆర్ట్ వర్క్స్ సావర ట్రైబ్ ఆర్టిస్ట్స్ తయారుచేసింది. ఏపీ లేపాక్షి షోరూం నుంచి ఈ పెయింటింగ్స్ తీసుకొచ్చారు. ఏపీలోని ఉత్తరాంధ్ర ఏజెన్సీకి చెందిన ఈ సావర ట్రైబ్ నేచురల్ కలర్స్ తో ఈ పెయింటింగ్స్ గీస్తారు. శతాబ్దాల చరిత్ర ఉన్న సావర తెగల వారి కళ అంతరించిపోతోంది. వీరి ఉనికిని కాపాడాలంటే మనమంతా సావర తెగలు తయారుచేసిన పెయింటింగ్స్, ఇతర అలంకరణ వస్తువులు కొనుగోలు చేసి ప్రోత్సహించాలి. పవన్ కల్యాణ్ గారు ఎవరికైనా బహుమతిగా కొండపల్లి, ఏటి కొప్పాక బొమ్మలతో పాటు సావర తెగల పెయింటింగ్స్ ఇస్తారు. మనమూ ఆ కృషిని, స్ఫూర్తిని కొనసాగించాలి. లేపాక్షి షోరూం సైట్ ద్వారా ఆన్ లైన్ లోనూ ఈ కళాకృతులు కొనుగోలు చేసుకోవచ్చు. అని పేర్కొన్నారు.
తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క భీజాక్షరంలో…
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం…
నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందనున్న యూనిక్ సైఫై ఎంటర్టైనర్.. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో…
తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…
కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్ పొలిశెట్టి కెరీర్లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…