ప్రతిభ గల రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందిన ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ను రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా లాంఛ్ చేశారు. తన సినిమాలతో వైవిధ్యమైన కథలను ప్రేక్షకులను అందిస్తుంటారు ప్రభాస్. ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ద్వారా మరిన్ని క్రియేటివ్ స్టోరీస్, టాలెంటెడ్ రైటర్స్ ఇండస్ట్రీకి రావాలనే ప్రయత్నానికి ప్రభాస్ తన వంతు మద్ధతు అందిస్తుండటం అభినందనీయం.
రచయితలు తమ స్క్రిప్ట్ ను 250 పదాల నిడివిలో ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసుకోవచ్చు. వీక్షకులు చదివి తమ రేటింగ్స్ ఇచ్చేలా సైట్ రూపొందించారు. అత్యధిక రేటింగ్ పొందిన స్క్రిప్ట్ లను టాప్ ప్లేస్ లో ఉంచబోతున్నారు. తమ రచనకు వచ్చే రేటింగ్ రైటర్స్ కాన్ఫిడెన్స్ పెంచనుంది. ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ మొదటి ప్రయత్నంగా రచయితలకు మీ ఫేవరేట్ హీరోకు సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో స్క్రిప్ట్ లను ఇన్వైట్ చేస్తోంది.
ఈ సైట్ ద్వారా రైటర్, అసిస్టెంట్ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాలకు పనిచేసే అవకాశాలు పొందవచ్చు. ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ద్వారా తమ కథలను రైటర్స్ ఆడియో బుక్స్ గా మార్చుకోవచ్చు. దీని వల్ల తమ స్క్రిప్ట్ లను మరింత మందికి చేరువయ్యేలా రైటర్స్ చేసుకోవచ్చు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…