టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఇది సెలబ్రేషన్ టైమ్!
2012లో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన “బిజినెస్‌మ్యాన్” సినిమా మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రాన్ని డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించగా, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ థమన్ అందించిన బీట్స్ అప్పట్లో సెన్సేషన్ సృష్టించాయి.
తాజాగా విడుదలైన పోస్టర్‌లో మహేష్ బాబు ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తూ, బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న సింహం “సూర్య భాయ్” పవర్‌కి సింబల్‌గా నిలిచింది.
పోస్టర్‌పై ఉన్న “Surya Bhai Roar Resurrects – November 29th in Theaters” అనే లైన్ ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్‌మెంట్‌ని క్రియేట్ చేసింది.
బిజినెస్‌మ్యాన్ సినిమాకు సంగీతం అందించిన ఎస్‌ఎస్ థమన్ మాస్ బీట్‌లతో ప్రేక్షకుల హృదయాలను కదిలించాడు. ఆయన అందించిన ప్రతి పాట కూడా సినిమాకి ఎనర్జీని పెంచుతూ, మహేష్ బాబు స్టైల్‌కి సరిపోయే విధంగా సెట్ అయ్యింది.
నిర్మాత డా. వెంకట్ ఆధ్వర్యంలోని R R Movie Makers ఈ చిత్రాన్ని అత్యంత విలువైన ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కించారు. అద్భుతమైన టెక్నికల్ స్టాండర్డ్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో సినిమా అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
మెగా ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా, పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ చిత్రం “బిజినెస్‌మ్యాన్” దేశవ్యాప్తంగా — అల్ ఓవర్ గ్రాండ్ రీ-రిలీజ్ కానుంది. మహేష్ బాబు చిన్నప్పటి నటుడిగా నటించిన మొదటి సినిమా “నీడా” (1979) నవంబర్ 29న తేదీ నాదే మళ్లీ బిజినెస్‌మ్యాన్ సినిమా ని రిలీజ్ చేస్తున్నాం అని మెగా ప్రొడక్షన్స్ సంస్ధ తెలిపారు.
ఖలేజా రీ-రిలీజ్ విజయంతో ఉత్సాహం నింపుకున్న మెగా ప్రొడక్షన్స్, ఈసారి మరింత విస్తృతంగా స్క్రీన్లు పెంచి, సూర్య భాయ్ గర్జనను దేశమంతా వినిపించడానికి సిద్ధమవుతున్నారు.
ఈ రీ-రిలీజ్‌ను మహేష్ బాబు 46 ఏళ్ల సినీ కెరీర్ సెలబ్రేషన్గా అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నారు.
అనేక నగరాల్లో 4K ప్రింట్‌తో ప్రత్యేక షోలు ప్లాన్ చేస్తున్నారు.
మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో “బిజినెస్‌మ్యాన్” మరోసారి థియేటర్లలో గర్జించనుంది.
“బిజినెస్‌మ్యాన్” కేవలం సినిమా కాదు – అది ఒక ఆట్టిట్యూడ్!
నవంబర్ 29న సూర్య భాయ్ గర్జనతో థియేటర్లు మళ్లీ హోరెత్తనున్నాయి.
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…
"ఆటగదరా శివా" అంటూ శివతత్వాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నటుడు - రచయిత- దర్శకుడు తనికెళ్ళ భరణి… సుప్రసిద్ధ మహిమాన్విత పుణ్యక్షేత్రం…