‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ .. దీపావ‌ళికి రిలీజ్

వెర్స‌టైల్ డైరెక్ట‌ర్  కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ నిర్మిస్తోన్న యాక్ష‌న్ డ్రామా ‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ .. దీపావ‌ళికి వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
 రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న హై యాక్ష‌న్ డ్రామా ‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ దీపావ‌ళికి రిలీజ్ అవుతుంది.

దీపావ‌ళికి రాబోతున్న‌ భారీ చిత్రాల్లో డేట్ ఫిక్స్ అయిన మూవీ ఇది. ఈ చిత్రాన్ని మేక‌ర్స్ తమిళ్‌, తెలుగు, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు.  

వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని కార్తీకేయ‌న్ నిర్మిస్తున్నారు. గ‌త ఏడాది  డిసెంబ‌ర్‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. అప్ప‌టి నుంచి శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంటోంది. 2014లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన జిగ‌ర్ తండా చిత్రానికి ఇది ప్రీక్వెల్‌. మూవీ అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన రోజు నుంచి ఈ సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ మాట్లాడుతూ ‘‘‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ చిత్రాన్ని ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌నుండ‌టం చాలా హ్యాపీగా ఉంది. ఇంత‌కు ముందు నా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన జిగ‌ర్ తండాకు ఇది ప్రీక్వెల్‌గా రానుంది. ఆ సినిమా సాధించిన‌ట్లే ‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు.

స్టోన్ బెంచ్ ఫిలింస్ అధినేత కార్తికేయ‌న్ సంతానం మాట్లాడుతూ ‘‘‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’  సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రిలో తెలియ‌ని ఎగ్జ‌యిట్‌మెంట్ క్రియేట్ అయ్యింది. జిగ‌ర్ తండాను ప్రేక్ష‌కులు ఎంత‌లా ఆద‌రించారో అలాగే ‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ ను కూడా ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను భారీ ఎత్తున తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నాం’’ అన్నారు.

జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’  చిత్రానికి కార్తీక్ సుబ్బ‌రాజ్ ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించారు. స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై కార్తికేయన్ సంతానం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని తమిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో దీపావ‌ళి 2023న రిలీజ్ చేయ‌బోతున్నారు.

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

7 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago