‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా: దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

Must Read

‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ నెల 6న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలివి

మీ నేపథ్యం ఏమిటి?
మా నేపథ్యం కడప. నాన్న పోస్ట్‌మాస్టర్‌. నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టం. సినిమా సెలబ్రిటిలా నాకు ఓ గుర్తింపు రావాలని కోరిక ఉండేది. హ్యపీడేస్‌ సినిమా చూసి ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. 2015 నుంచి సినీ పరిశ్రమలోకి ఉన్నాను. కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. అడవిశేష్‌ నటించిన ఎవరు సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఆ చిత్ర దర్శకుడు రామ్‌జీ నాకు గురువు, ఆయన నాకు గాడ్‌ఫాదర్‌ లాంటి వాడు. ఆయన వల్లే నేను ఈ రోజు దర్శకుడి మీ ముందుకు వచ్చాను.

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రానికి శివాజీ గారిని హీరో ఎంచుకోవడానికి రీజన్‌?
90స్‌ సినిమాలో శివాజీ గారిని చూడగానే మా నాన్న గుర్తొచ్చారు. సినిమా కథలు చెప్పే సమయంలో ఆయనకు ఎందుకు కథ చెప్పకూడదు? అనిపించి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కథతో శివాజీ గారిని అప్రోచ్‌ అయ్యాను. కథ వినగానే ఆయన ఈ కథను నేనే ప్రొడ్యూస్‌ చేస్తాను అన్నారు. ఆ మాట వినగానే ఎంతో హ్యపీగా అనిపించింది. ఈ కథను శివాజీ గారు ఈటీవీ వాళ్లకు కూడా చెప్పమన్నారు. నితిన్‌ గారు, సాయికృష్ణ గారు కథ వినగానే వాళ్లు కూడా ఓకే చేశారు. ఫైనల్‌గా బాపినీడు గారు కూడా ఓకే చేశారు అప్పటి నుంచి ఈ సినిమా జర్నీ ప్రారంభమైంది. శివాజీ వల్ల ఈ సినిమా స్పీడ్‌గా పూర్తిచేశాను.

ఈ సినిమా ఎలాంటి కథాంశంతో ఉంటుంది?
ఈ కథ క్రైమ్‌ కామెడీ. దర్శకుడు నెల్సన్‌ తెరకెక్కించే సినిమా తరహాలో ఉంటుంది. కో..కో.కోకిల, డాక్టర్‌ సినిమాలా డార్క్‌ కామెడీ ఉంటూ థ్రిల్లింగ్‌ నేపథ్యం ఉంటుంది. ఈ రోజు విడుదల చేసిన ట్రయిలర్‌ చూస్తే అందరికి అర్థమవుతుంది. సెటిల్‌గా ఉంటే డార్క్‌ కామెడీ నాకు ఇష్టం. నా శైలికి దగ్గరగా ఉండే జోనర్‌ ఇది. డెఫినెట్‌గా ఫ్యామిలీ మొత్తం థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలిసిన సినిమా. ఫన్‌తో పాటు ఎమోషన్‌ ఉంటుంది. సినిమా చూసిన తరువాత ఒక మంచి ఎంటర్‌టైనర్‌ సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది.

మొదట్లో ఈసినిమాను ఓటీటీలో డైరెక్ట్‌ స్ట్రీమింగ్‌ అన్నారు? ఇప్పుడు థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు ? ఎందుకని?
ముందుగా థియేటర్‌ కోసమే అనుకున్నాం. ఈటీవీ వాళ్లు కూడా అదే అనుకున్నారు.లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయ్‌ థియేటర్‌లో విడుదలైన తరువాత ఈటీవీ విన్‌ వాళ్లకు ఎక్కడో ఈటీవీ విన్‌ వర్జినల్‌ మిస్‌ అవుతున్న ఫీలింగ్‌ కలిగింది. సో.. వాళ్లు ఇది మంచి సినిమా, ఈటీవీ విన్‌లో డైరెక్ట్‌గా స్ట్రీమ్‌ చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఈ సినిమా అనిల్‌రావిపూడి సజేషన్‌తో థియేటర్‌కు తీసుకొస్తున్నాం. నా ఫస్ట్‌ సినిమాలో నా పేరును థియేటర్‌లో స్క్రీన్‌ మీద చూసుకునే ఎమోషన్‌ మిస్‌ అవుతుందేమోనని అనుకున్నాను. కానీ ఇప్పుడు సినిమా థియేటర్లో విడుదల కావడం హ్యపీగా ఉంది.


ఈ సినిమాలో పాత్రలు ఎలా ఉంటాయి?
ఈ కథలో అన్ని పాత్రలకు ఫర్‌ఫెక్ట్‌ ఆర్టిస్టులు కుదిరారు. ప్రతి క్యారెక్టర్‌లో కొత్త కోణం ఉంటుంది. సెట్‌లో అందరూ ఈ సినిమా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు నవ్వుకునేవారు. ఈ సినిమా ప్రారంభం కాగానే మొదటి 20 నిమిషాల తరువాత మరో కోణంలోకి వెళుతుంది.

శివాజీ గారి పాత్ర 90స్‌ కిడ్స్‌లోని పాత్రకు పోలీక ఉంటుందా?
90స్‌ పాత్రకు, ఈ సినిమాలో పాత్రకు ఏం సంబంధం ఉండదు.ఈ సినిమాలో ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండే పాత్ర. నాకు ఆన్‌స్క్రీన్‌లో శివాజీ నా శ్రీరామ్‌ ఫర్‌ఫెక్ట్‌గా కుదిరాడు. ఈ సినిమా టైటిల్‌ కూడా శివాజీ గారు సజెస్ట్‌ చేశారు. శివాజీ గారు అన్‌బోర్డ్‌ అవ్వడం వల్ల సినిమా వాల్యూ పెరిగింది.

ఈ సినిమా మేకింగ్‌ శివాజీ గారి ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఎంత వరకు ఉంది?
శివాజీ గారు ఇన్‌వాల్వ్‌మెంట్‌ కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయన స్టయిల్‌లో డైలాగులు చెప్పేవాడు. ఆయన ప్రాపర్‌గా పాటల్లో ఇన్‌వాల్వ్‌ అయ్యాడు. పాయ సాంగ్‌ శివాజీ గారి సజేషన్‌తో చేశాం. ఆయన సలహాలు కూడా ఎంతో వాల్యూబుల్‌గా ఉండేది. షూట్‌ ప్రారంభానికి చెప్పిన కథనే మీరు తెరపై చూడబోతున్నారు. స్క్రీప్ట్‌ ఏ రోజు మారలేదు. మొదటి రోజు చెప్పిన కథతోనే సినిమా తీశాను.

ఈ సినిమా ప్రేక్షకులకు థియేటర్స్‌లో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వబోతుంది?
ఈ సినిమా ను డెఫనింట్‌గా థియేటర్‌లో ఎంజాయ్‌ చేసే సినిమా ఇది. అనిల్‌ రావిపూడి గారితో పాటు కొంత మంది సినిమా చూశారు. చూసిన ప్రతి ఒక్కరూ ఫస్టాఫ్‌ హిలేరియస్‌గా ఎంజాయ్‌ చేశార, సెకండాఫ్‌లో సస్పెన్స్‌ చూసి ఎంతో థ్రిల్ల్‌గా ఫీలయ్యారు. ఆ ఎక్స్‌పీరియన్స్‌ను అనుభవించారు. ఈ సినిమా థియేటర్‌ అయినా ఓటీటీ అయినా అందరికి నచ్చుతుంది. ఫైనల్‌గా థియేటర్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉంది.

పర్సనల్‌గా మీకు ఎలాంటి సినిమాలకు దర్వకత్వం చేయాలని ఉంది?
పర్సనల్‌గా ఓ జోనర్‌ అని కాదు. నా నుంచి తదుపరి నాలుగు కథలు నాలుగు డిఫరంట్‌గా ఉంటాయి. ఫాంటసీ, సైన్స్‌ పిక్షన్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ కథలు ఉన్నాయి. మైథలాజికల్‌ కథ కూడా ఉంది. ఒకే జోనర్‌కు పరిమితం కావడం నాకు ఇష్టం లేదు.

మీ సినిమాలో కామెడీ మాత్రమే ఉంటుందా? కథ, లాజికల్‌లు ఉంటాయా?
ఈ సినిమా చూసిన తరువాత కథ లేదు. లాజిక్‌లు లేవు అని ఎవరు అనరు. ఎవరూ కూడా ఈ సన్నివేశం అనవసరంగా పెట్టాం అనే ఫీలింగ్‌ కూడా రాదు. మీరు సినిమాలో చూసే ప్రతి సీన్‌కు, ప్రతి పాత్రకు ఓ లాజికల్‌ పాయింట్‌ ఉంటుంది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్ వరకు పర్‌ఫ్టెక్ట్‌గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా రాసుకున్న కథ ఇది.

ఫైనల్‌గా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా గురించి ఏం చెబుతారు?
ఆడియన్స్‌ డెఫినెంట్‌ గా హిలేరియస్‌గా ఫస్టాఫ్‌ ఎంజాయ్‌ చేస్తారు. రెండో భాగం క్రైమ్‌లోకి వెళ్లి థ్రిల్లింగ్‌గా ఉంటుంది. థియేటర్‌లో ఎంజాయ్‌ చేయగలిగే అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి.

Latest News

ఆకట్టుకుంటున్న ‘విశ్వనాథ్ & సన్స్’ ఫస్ట్ లుక్.. త్వరలోనే టీజర్ విడుదల

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి 'విశ్వనాథ్ & సన్స్' టైటిల్ ఖరారు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న 'సూర్య46' చిత్రానికి 'విశ్వనాథ్...

More News