‘ఉస్తాద్’ఆగ‌స్ట్ 12న భారీ విడుద‌ల‌

శ్రీసింహా కోడూరి, కావ్యా కళ్యాణ్ రామ్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఉస్తాద్’ షూటింగ్ పూర్తి ఆగ‌స్ట్ 12న భారీ విడుద‌ల‌

కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంటున్న యంగ్ హీరో శ్రీసింహా కోడూరి. ఆస్కార్ విన్నింగ్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి కొడుకు అయిన‌ప్పటినీ త‌న‌దైన రూట్‌ను ఏర్ప‌రుచుకుంటూ ముందుకు వెళుతున్నారు శ్రీసింహ‌. మత్తు వదలరా, భాగ్ సాలే వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ఈయ‌న ఆగ‌స్ట్ 12న ‘ఉస్తాద్‌’  చిత్రంతో మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. 

  ‘ఉస్తాద్’ మూవీ అనౌన్స్‌మెంట్ రోజు నుంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీలో  కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరోయిన్‌. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై ‘ఉస్తాద్‌’ చిత్రాన్ని ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. 

రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌.. ‘రోజు..’ అనే సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో, ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఆడియెన్స్‌ను అల‌రిస్తుంద‌ని మేక‌ర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇందులో శ్రీసింహ మూడు డిఫ‌రెంట్ షేడ్స్‌లో కనిపించ‌బోతున్నారు. డిఫ‌రెంట్ మూవీస్‌, ప‌రిమిత బ‌డ్జెట్‌ల‌తో రూపొందుతోన్న సినిమాల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తున్న నేప‌థ్యంలో ఉస్తాద్ నిర్మాత‌లు అదే న‌మ్మ‌కంతో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌, అను హాస‌న్‌, రవీంద్ర విజ‌య్‌, వెంక‌టేష్ మ‌హ‌, ర‌వి శివ తేజ‌, సాయికిర‌ణ్ ఏడిద కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అకీవా. బి సంగీతాన్ని అందిస్తున్నారు. 

న‌టీన‌టులు:

శ్రీసింహా కోడూరి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌, అను హాస‌న్‌, ర‌వీంద్ర విజ‌య్‌, వెంక‌టేష్ మ‌హ. ర‌వి శివ తేజ‌, సాయి కిర‌ణ ఏడిద‌ తదిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

సాయి కొర్ర‌పాటి ప్రొడ‌క్ష‌న్‌

బ్యాన‌ర్స్‌:  వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

నిర్మాత‌లు:  ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  ఫ‌ణిదీప్‌

సినిమాటోగ్ర‌ఫీ:  ప‌వ‌న్ కుమార్ పప్పుల

మ్యూజిక్‌:  అకీవా.బి

ఎడిట‌ర్‌:  కార్తీక్ క‌ట్స్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: అర‌వింద్ ములె

సౌండ్ డిజైన్‌: అశ్విన్ రాజ‌శేఖ‌ర్‌

కాస్ట్యూమ్స్‌:  ప్రియాంక వీర‌బోయిన‌

వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌:  సునీల్ రాజు చింత‌

లిరిక్స్‌: అనంత శ్రీరాం, రెహ‌మాన్‌, ల‌క్ష్మీ ప్రియాంక‌

లైన్ ప్రొడ్యూస‌ర్స్‌:  ప్ర‌జ‌న‌య్ కొనిగ‌రి, రాజేష్ గ‌డ్డం

పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago