ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “స్కై”

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా “స్కై”. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. “స్కై” సినిమా ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

తాజాగా ఈ చిత్రం నుంచి ‘నిను కసిరిన సమయాన…’ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు పృథ్వీ పెరిచెర్ల మంచి లిరిక్స్ రాయగా, వైష్ణవి ఆకట్టుకునేలా పాడారు. శివప్రసాద్ బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. ‘నిను కసిరిన సమయాన’ పాట ఎలా ఉందో చూస్తే – ‘నిను కసిరిన సమయాన, నను మరచిన నా హృదయం, అడుగడుగున నిను వెతికి, అణువణువున నిను తలచి, ఆలోచనంతా నీ వెనకే, ఆరాధనంతా నీ కొరకే..’ అంటూ లవ్ ఫీల్ తో ఆకట్టుకుంటోందీ పాట. “స్కై” సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ‘తపనే తెలుపగ..’, ‘పోయేకాలం నీకు..’, ‘నిన్ను చూసిన..’ సాంగ్స్ ఛాట్ బస్టర్స్ గా మారి మిలియన్ వ్యూస్ రీచ్ అయ్యాయి. ఈ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ఆదరణ పొందుతుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

నటీనటులు – మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్ కే మణి బమ్మ, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ – వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – పృథ్వీ పెరిచెర్ల
డీవోపీ – రసూల్ ఎల్లోర్
ఎడిటర్ – సురేష్ ఆర్స్
పబ్లిసిటీ డిజైనర్ – కృష్ణ డిజిటల్స్
డిజిటల్ మీడియా – వినీత్ గౌడ్
ప్రొడ్యూసర్స్ – నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు
డైలాగ్స్ , స్టోరీ – పృథ్వీ పెరిచెర్ల, మురళీ కృష్ణంరాజు
మ్యూజిక్ – శివ ప్రసాద్
లిరిక్స్ – పృథ్వీ పెరిచెర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – స్వాతి పెన్మెత్స, లిఖిత గుంటక
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

TFJA

Recent Posts

నటనపై దృష్టి సారిస్తూ కొత్త ప్రయాణం మొదలుపెట్టిన నిర్మాత యష్ రంగినేని

బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫోటో స్టూడియో వంటి విజయవంతమైన చిత్రాలను…

6 hours ago

మార్చి 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయిన ప్రియదర్శి సాయి కుమార్ ల సుయోధన చిత్రం

ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్…

9 hours ago

గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్న హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…

11 hours ago

బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ – ఈటీవీ విన్ నుంచి “ఇంకా ఎం అనుకోలేదు” క్రేజీ టైటిల్ అనౌన్స్‌మెంట్ సెప్టెంబర్ 4న సినిమా విడుదల

ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి, మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి…

11 hours ago

ఇంటర్నేషనల్ వుమెన్స్ డే సందర్భంగా స్టార్ హీరోయిన్ నభా నటేష్ కవర్ పేజీ పబ్లిష్ చేసిన ప్రముఖ మేగజైన్ షీ ఇండియా

ఈరోజు ఇంటర్నేషనల్ వుమెన్స్ డే సందర్భంగా ప్రముఖ మేగజైన్ షీ ఇండియా స్టార్ హీరోయిన్ నభా నటేష్ ను తన…

13 hours ago

ఘనంగా నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ కు ‘కత్తి’ కాంతరావు స్మారక జాతీయ పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమం

భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో నటప్రపూర్ణ…

13 hours ago