శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న మ్యాసీవ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో ట్యాలెంటెడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ పవర్ ఫుల్ విలన్ రోల్ పోషిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో విద్యుత్ జమ్వాల్ జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ విడుదల చేసిన మేకింగ్ వీడియోలో విద్యుత్ జమ్వాల్ గన్ షూట్ చేస్తూ కనిపించడం చాలా ఇంట్రస్టింగ్ గా వుంది.
దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన పాపులర్ స్టొరీ టెల్లింగ్ స్టయిల్, యూనిక్ సెట్టింగ్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం హై యాక్షన్-ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది.
వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందిస్తున్న హీరో శివకార్తికేయన్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్, మ్యాసీవ్ మూవీ. శివకార్తికేయన్ యూనిక్, స్టైలిష్ అవతార్ లో కనిపిస్తారు. ట్యాలెంటెడ్ కన్నడ యాక్ట్రెస్ రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ రాక్‌స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అరుణ్ వెంజరమూడు ఆర్ట్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రాఫ్.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…