సీతారాం సిత్రాలు సినిమా ట్రైలర్ లాంచ్

లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక ప్రధాన పాత్రల్లో రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ పి. పార్థసారథి, డి. నాగేంద్ర రెడ్డి, కృష్ణ చంద్ర విజయబట్టు నిర్మాతలుగా డి. నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా సీతారాం సిత్రాలు. ఈ సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్ నేడు ఆకాష్ జగన్నాథ్ గారి చేతుల మీదుగా జరిగింది. ఈ సినిమా ఈనెల 30న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ : తెలుగు ప్రేక్షకులు సినిమా నచ్చితే తమ భుజాల పైన వేసుకుని ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఇండస్ట్రీ కూడా మన తెలుగు ప్రేక్షకుల వైపే చూస్తుంది. సినిమా బాగుంటే పెద్ద విజయాన్ని అందిస్తారు. ఈ సినిమా కూడా అందరూ చూసి ఆదరించి పెద్ద విజయాన్ని అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ : సీతారాం సిత్రాలు లో పనిచేసిన ప్రతి ఒక్కరు ఇది తమ సొంత సినిమా లాగా కష్టపడి పని చేశారు. ఈ సినిమా డిజిటల్ గా ట్రైలర్ లాంచ్ చేసిన డైరెక్టర్ మారుతి గారికి, రెండు పాటల్ని విడుదల చేసిన హీరో విశ్వక్సేన్ గారికి, హీరో సందీప్ కిషన్ గారికి కృతజ్ఞతలు. చిన్న సినిమా అయిన సపోర్ట్ ఇస్తున్న హీరో కార్తికేయ గారికి కృతజ్ఞతలు. ట్రైలర్ లాంచ్ చేసి మమల్ని సపోర్ట్ చేస్తున్న ఆకాష్ జగన్నాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రేక్షకులు అందరూ ఈ చిన్న సినిమాని ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ భ్రమరాంబిక మాట్లాడుతూ : టైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన ఆకాష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం మేం అంత ఎంతో ఇష్టపడి కష్టపడి పని చేసాం. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసి మంచి సక్సెస్ చేయాలని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము అన్నారు.

డైరెక్టర్ డి.నాగ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ : ముందుగా మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్న డైరెక్టర్ మారుతి గారికి, హీరో విశ్వక్సేన్ గారికి, హీరో సందీప్ కిషన్ గారికి మరియు హీరో కార్తికేయ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చి సపోర్ట్ చేస్తున్న ఆకాష్ జగన్నాథ్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా 2019 కోవిడ్ వచ్చిన తర్వాత మెంటల్ స్ట్రెస్ కి జనాలు ఎక్కువ గురవుతున్నారు. ఆ కోవిడ్ టైంలో ఎక్కువ స్ట్రెస్ రిలీఫ్ ఇచ్చింది సినిమాలే. నేను ఎక్కువ చూసింది జంధ్యాల, ఈవివి సత్యనారాయణ, రేలంగి గార్ల సినిమాలు ఎక్కువ చూశాను. మా ఈ సీతారాం సిత్రాలు సినిమా కూడా అలాంటి స్ట్రెస్ రిలీఫ్ సినిమా అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాను అన్నారు.

హీరో లక్ష్మణ మూర్తి రతన మాట్లాడుతూ : గుడికి వెళితే ప్రశాంతంగా ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అంతే ప్రశాంతంగా ఉంటుంది. ఈ సినిమా మొత్తం కొత్త వాళ్ళం కలిసి చేసాం. మమ్మల్ని నమ్మి సినిమా చేసిన మా ప్రొడ్యూసర్లకి కృతజ్ఞతలు. దర్శకుడు శశిధర్ చెప్పిన కథ చాలా బావుంది. ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు :
లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక, కిషోరి ధాత్రక్, ఆకెళ్ళ రాఘవేంద్ర, సందీప్ వారణాసి, ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి వంజారి

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి, కృష్ణ చంద్ర విజయ బట్టు
కెమెరామెన్: అరుణ్ కుమార్ పర్వతనేని మ్యూజిక్: రుద్ర కిరణ్
BGM: శిరీష్ సత్యవోలు
ఎడిటర్: ప్రణీత్ కుమార్
సౌండ్ డిజైన్: సాయి మనిందర్ రెడ్డి
లిరిక్స్: శేఖర్ రాజు విజయభట్టు
రచన, దర్శకత్వం: డి.నాగ శశిధర్ రెడ్డి
డిజిటల్ మీడియా : వారెయ్ మీడియా ( WAREY MEDIA )
పి ఆర్ ఓ : మధు VR

Tfja Team

Recent Posts

సంగీత ప్రియులను కట్టిపడేస్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం తొలి గీతం ‘నేనో బటర్‌ఫ్లై’

సూర్య అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వనాథ్ & సన్స్’. బ్లాక్‌బస్టర్ దర్శకుడు…

12 hours ago

జూన్ 27న మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు ‘కన్నప్ప’

డైనమిక్ హీరో విష్ణు మంచు గత ఏడాది ‘కన్నప్ప’ అంటూ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్…

2 days ago

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…

2 days ago

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సోమవారం సాయంత్రం హైదరాబాద్ AMB సినిమాస్‌లో జరిగిన “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన…

3 days ago

‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల

విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజీ…

4 days ago

ప్రైమ్ వీడియో “ఇసకపట్నం” చిత్ర ట్రైలర్ విడుదల

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసకపట్నం’ ట్రైలర్ను…

5 days ago