మాస్క్ మ్యాన్ ఎవరో కనిపెడితే సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఆపరేషన్ రావణ్ మేకర్స్

Must Read

రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. “ఆపరేషన్ రావణ్” సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

ఈ సినిమాలో మాస్క్ మ్యాన్ సైకో క్యారెక్టర్ కీలకంగా ఉండనుంది. సినిమా ప్రారంభమైన గంటలోపు ఆ సైకో ఎవరన్నది కనిపెడితే ఆ ప్రేక్షకుడికి సిల్వర్ కాయిన్ ఇస్తామని ప్రకటించారు మేకర్స్. అలా వెయ్యిమందికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నారు. “ఆపరేషన్ రావణ్” సినిమా చూస్తున్న ప్రేక్షకులు థియేటర్‌ లో నుంచి తమ ఫొటో, టికెట్, ఎవరు సైకో అనే ఆన్సర్ ను 9573812831 నెంబర్ కు వాట్సాప్ చేయాలి. ఇలా పంపిన వారిలో వెయ్యి మంది ప్రేక్షకులకు ఒక్కొక్కరికి ఒక్కో సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు.

Latest News

వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’

ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో 'హరి హర వీరమల్లు' ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై...

More News