భారీ సెట్‌లో సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా సాంగ్ చిత్రీకరణ

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ న్యూ మూవీ ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్నారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్‌లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నారు.

తాజాగా సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై సినిమా మొదటి పాటను చిత్రీకరించడం ప్రారంభించారు. థమన్ స్కోర్ చేసిన చార్ట్‌బస్టర్ సాంగ్ కు కెకె లిరిక్స్ రాశారు. ఇటీవలే నా సామి రంగాతో దర్శకుడిగా పరిచయం అయిన విజయ్ బిన్నీ హ్యుజ్ సెట్‌లో చిత్రీకరిస్తున్న పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాటకు సిద్ శ్రీరామ్ వోకల్స్ అందించనున్నారు.

ఇది 30 రోజుల పాటు సాగే క్రూషియల్ షెడ్యూల్. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్ గా నటిస్తుండగా, వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నారు. సిద్దు జొన్నలగడ్డ తన పాత్ర కోసం స్టైలిష్ మేకోవర్ అయ్యారు.

నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ ఈ సినిమాని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు.

నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష
రచన, దర్శకత్వం: నీరజ కోన
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: జ్ఞాన శేఖర్ బాబా
ఎడిటర్: నవీన్ నూలి
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago